BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘ఏఐతో జీవాయుధాల తయారీకి ప్రయత్నం’.. అడ్డుకున్నామన్న ఆంథ్రోపిక్
జీవాయుధాలు, సంప్రదాయ ఆయుధాల తయారీకి ఏఐ మోడళ్లను వాడుకునేందుకు చైనా, రష్యా హ్యాకర్లు చేస్తున్న యత్నాలను అడ్డుకున్నట్లు ఆంథ్రోపిక్ వెల్లడిస్తూ, ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇంతకీ, ఈ తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది? కృత్రిమ మేధ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు?
స్నేక్ రిపెల్లెంట్ స్ప్రేలు, కొన్ని మొక్కలు.. నిజంగా పాములను తరిమికొడతాయా?
పాములను తరిమికొడతాయని ఆన్లైన్లో అమ్మే స్ప్రేలు, రసాయనాలు నిజంగా పనిచేస్తాయా? కొన్ని రకాల మొక్కలు పెంచితే పాములు రావా? ఈ ప్రచారాల్లో నిజమెంత, పరిశోధనలు ఏం తేల్చాయి? ఇళ్లలోకి పాములు రాకుండా ఉండాలంటే నిపుణులు చెబుతున్న ఆచరణాత్మక పద్ధతులు ఏమిటి?
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ: 'అమ్మవారి శాపం' చుట్టూ అల్లుకున్న కథ ఎలా సాగింది?
కాంతారా తర్వాత అన్ని భాషల్లో మైథాలజీతో ముడిపడిన థ్రిల్లర్ సినిమాలు పెరిగాయి. ఇది కూడా అలాంటిదే. ఇలాంటి సినిమాలకి అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ వరకు కథలో ఎన్ని చిక్కుముడులైనా వేయొచ్చు. ఇది ప్లస్. సెకండాఫ్‌లో ఒక్కో ముడి విప్పుతూ ట్విస్టులతో ప్రేక్షకున్ని షాక్‌కి గురి చేయాలి.
రూ.కోటిన్నర పంపమంటూ కంపెనీ బాస్ నుంచి వాట్సాప్ మెసేజ్...కానీ ఆ మెసేజ్ బాస్ పంపలేదు.. ఏమిటీ ‘బాస్ స్కామ్’?
అహ్మదాబాద్‌లో వెలుగులోకి వచ్చిన 'బాస్ స్కామ్'లో.. సైబర్ నేరగాళ్లు కంపెనీ బాస్ గుర్తింపులను ఉపయోగించి ఉద్యోగులతో కంపెనీ డబ్బును మరో ఖాతాకు బదిలీ చేయించి మోసం చేస్తున్నారని తేలింది. ఈ రకమైన మోసంలో, సైబర్ నేరగాళ్లు కంపెనీ యజమాని పేరు, ప్రొఫైల్ ఫోటోను ఉపయోగిస్తారు.
ఈఫిల్ టవర్ వివాదం: ఏమిటీ స్వామి నారాయణ సంప్రదాయం, వీరు మహిళలకు దూరంగా ఎందుకు ఉంటారు?
''ఒక మహిళను చూసిన తర్వాత పురుషులు తమ భావోద్వేగాలను, భావాలను నియంత్రించుకోలేకపోతే దానికి మహిళలు ఎందుకు శిక్ష అనుభవించాలి? పురుషులు కళ్ళు మూసుకోవాలి లేదా మహిళలు ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. నేను శాకాహారిని కాబట్టి నేను బయటకు వెళ్ళినప్పుడు నా చుట్టూ ఉన్న మాంసాహార దుకాణాలన్నింటినీ మూసివేయాలని డిమాండ్ చేయడంలాంటిదే ఇది కూడా'
‘‘మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు చెల్లిస్తాం’’ -ట్రంప్ వివాదాస్పద ప్రకటన
అమెరికాలో సుమారు 27 కోట్ల మంది పెద్దవారు ఉన్నారు. ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు చెల్లించాలంటే అమెరికా ప్రభుత్వానికి సుమారు 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అమెరికాలో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఈ ఖర్చుకు సంబంధించిన విధివిధానాలను ట్రంప్ వెల్లడించలేదు.
సెప్టెంబర్ 11 దాడులు: ‘‘నా మనసును నిరంతరం తొలిచేస్తోంది’’.. పాతికేళ్లు గడిచినా బాధిత కుటుంబాలకు దక్కని ఊరట
సెప్టెంబర్ 11 దాడులు జరగడానికి ముందురోజులలో జాన్, సిల్వియా దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా గదిని సిద్ధం చేస్తూ,బ్లూక్లూస్ అనే చిన్నారు టీవీ షోలోని పాత్రలను ఆ గది గోడలపై చిత్రిస్తున్నారు. తమకో బిడ్డ కావాలని ఎంతోకాలంగా కలలు కంటున్నారు. స్నేహితులు, బంధువుల పిల్లలను కూడా ఎంతో ముద్దుగా చూసుకునేవారు.
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' మూవీ రివ్యూ: ‘బేబీ’ కాంబో మ్యాజిక్ చేసిందా?
హీరోయిన్‌కి క్యారెక్టర్ని దర్శకుడు కాస్త వెరైటీగా రాసుకున్నాడు . ఆరంభంలో ప్రేక్షకుడికి అంత సులువుగా అందదు. ఆ క్యారెక్టర్ని తప్పు పట్టే అవకాశం కూడా ఉంది. నిజంగా ఒకరకంగా అది సందీప్ వంగా హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవాలి.
ఎర్రన్నాయుడు నుంచి రేవంత్ రెడ్డి వరకు.. సోషల్ మీడియాలో 80ల వింటేజ్ లుక్ ట్రెండ్
1980ల నాటి లుక్ ఫోటోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ లేటెస్ట్ ఫోటోలకు రెట్రో రూపాన్ని ఇచ్చి మురిసిపోతున్నారు. అంతేకాకుండా మరికొందరు తాము 80ల్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఏఐతో జనరేట్ చేసిన ఫోటోలు ఒకవైపు, ఒరిజినల్ ఫోటోలు మరోవైపు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































