బీబీసీ తెలుగు ప్రైవసీ పాలసీ

చదివే సమయం: 4 నిమిషాలు

మీ నమ్మకం మాకు చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత సమాచార గోప్యతను, భద్రతను పరిరక్షించడానికి బీబీసీ కట్టుబడి ఉందని దీని అర్థం. అలాంటి వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా, ఎందుకు ఉపయోగిస్తున్నామో మీకు తెలియడానికి మీరు ఈ నోటీసును చదవడం ముఖ్యం. మాతో మీరు అనుసంధానమై ఉన్నప్పుడు, ఆ తర్వాత, దానికి వర్తించే సమాచార రక్షణ చట్టాలకు అనుగుణంగా మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తామో, దానిని ఎలా ఉపయోగిస్తామో ఈ ప్రైవసీ నోటీసు వివరిస్తుంది.

కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రైవేట్ లిమిటెడ్ ("కలెక్టివ్ న్యూస్‌రూమ్") అనే కొత్త, స్వతంత్ర, భారతీయ యాజమాన్యంలోని సంస్థ ఇప్పుడు బీబీసీకి చెందిన ఆరు భారతీయ భాషా సర్వీసుల కోసం కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసి, పబ్లిష్ చేస్తుందని గమనించండి. దీని అర్థం, ఆరు భారతీయ భాషా సర్వీసుల కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి వీలుగా కంట్రిబ్యూటర్లు, బీబీసీ వెబ్‌‌సైట్ వినియోగదారులు, ఇతరుల గురించిన వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ, కలెక్టివ్ న్యూస్‌రూమ్ పరస్పరం పంచుకుంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని విశ్వసనీయ సమాచార నిర్వహణకర్తగా కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఎలా చూసుకుంటుందనే దానిపై మరింత సమాచారం కోసం వారి ప్రైవసీ పాలసీని చూడండి.

ఏ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ సేకరిస్తుంది? మేం దానిని ఎలా ఉపయోగిస్తాం?

వర్తించు చట్టంలో అనుమతించకపోతే తప్ప, మీ వ్యక్తిగత సమాచారం మాకు ఎందుకు అవసరం, మేం దానిని ఎలా ఉపయోగిస్తాం అనే వివరాలను, ఆ సమాచారాన్ని సేకరించడానికి ముందుగానే మేం తెలియజేస్తాం.

  • మీరు మాకు ఇచ్చే సమాచారం

సాధారణంగా, మీరు బీబీసీ వెబ్‌సైట్‌‌లను సందర్శించి, న్యూస్ ఫీడ్, లైవ్ చాట్, మెసేజెస్, పోటీలు వంటి మా సేవలను ఉపయోగించినప్పుడు మీ పేరు, ఈ-మెయిల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, వయసు, టెలిఫోన్ లేదా మొబైల్ నంబర్ ఇవ్వాలని మేం మిమ్మల్ని అడగవచ్చు.

మీరు మాకు ఇచ్చే సమాచారంలో కామెంట్‌ కాని, వీడియో క్లిప్ (తయారు చేసినవి)లో కానీ ఉన్న వ్యక్తుల పేర్లు, మారు పేర్లు, ముఖాలు, ఫొటోలు, వాయిస్‌లు, ఆడియో విజువల్ రికార్డింగ్‌‌ల వంటి వాటితో పాటు ఆయా క్రియేషన్‌లో కనిపించే సమాచారం కూడా ఉండవచ్చు.

మీ వయస్సు 16 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ (లేదా వర్తించే చట్టం ప్రకారం నిర్దేశించిన మెజారిటీ వయస్సులోపు) ఉన్నట్లయితే బీబీసీ వెబ్‌‌సైట్‌లను యాక్సెస్ చేసే ముందు, మీ వ్యక్తిగత సమాచారాన్ని మాకు సమర్పించే ముందు మీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతిని పొందండి. ఈ సమ్మతి లేకుండా బీబీసీ వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయడానికి, మీ వ్యక్తిగత సమాచారాన్ని మాకు అందించడానికి మీకు అనుమతి లేదు.

  • డివైజ్ సమాచారం

మీరు బీబీసీ వెబ్‌‌సైట్‌లను సందర్శించినప్పుడు కుకీలు, ఇతర ట్రాకింగ్ టెక్నాలజీల ద్వారా మేం మీ పరికరాలు, వెబ్ బ్రౌజర్‌‌ల నుంచి కొంత సాంకేతిక సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సేకరిస్తాం. ఇందులో ఇవి ఉండవచ్చు:

  • ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) అడ్రస్
  • డివైజ్ ఐడీ
  • యాప్ ఐడీ
  • వెండర్ ఐడీఁ
  • ప్రకటనల ఐడీ

నా గురించి సేకరించిన ఈ సమాచారాన్ని బీబీసీ ఎలా ఉపయోగిస్తుంది?

మీ సమాచారాన్ని మేం ఈ కింది రకాల కార్యకలాపాల కోసం ఉపయోగిస్తాం.

  • మా సేవలను అందించడానికి, వాటి గురించిన సమాచారాన్ని మీకు అందించడానికి
  • మీ క్రియేషన్‌ను ఉపయోగించడానికి. మీరు బీబీసీ ప్రోగ్రామ్‌‌లకు కంట్రిబ్యూషన్లు అందిస్తున్నపుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎలా ప్రాసెస్ చేస్తామనే దానిపై సమాచారం కోసం, మా కంట్రిబ్యూటర్ల ప్రైవసీ నోటీసును ఇక్కడ చూడండి.
  • వార్తలు, ఆఫర్‌లు, ప్రమోషన్‌లతో మీకు ఈమెయిల్‌‌లు పంపడానికి
  • మీ అభ్యర్థనలు, ఫిర్యాదులు, విచారణలపై తగిన రీతిలో స్పందించడానికి
  • మా సేవలపై మీకు ప్రకటనలను చూపడానికి, అది ఎంత ప్రభావవంతంగా ఉందో అర్థం చేసుకోవడానికి
  • మా ఉత్పత్తులు, సేవలను సోషల్ మీడియాలో మీకు మార్కెట్ చేయడానికి
  • మీరు ఎలాంటి సేవలను ఉపయోగించే అవకాశం ఉందో అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడడానికి
  • పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో బీబీసీకి వీలుకల్పించడానికి

మీరు బీబీసీకి అందించే సమాచారాన్ని మేం సర్వీస్ మేనేజ్‌‌మెంట్ ‌సహా వివిధ రకాలుగా ఉపయోగిస్తాం. దీని అర్థం మీరు బీబీసీతో నమోదు చేసుకున్న సేవ కోసం బీబీసీ మిమ్మల్ని సంప్రదించవచ్చు.

మీరు అభ్యంతరకరమైన, అనుచితమైన లేదా అసభ్యమైన కంటెంట్‌‌ను మాకు పంపినట్లయితే, పరిస్థితులను బట్టి థర్డ్ పార్టీలకు (వర్తించే చట్టం ప్రకారం అనుమతించిన విధంగా) మీ ప్రవర్తనను పరిశోధించడానికి లేదా ఫిర్యాదు చేయడానికి మేం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చని తెలుసుకోండి.

బయటి లింకు‌లు

మేం కొన్నిసార్లు బీబీసీయేతర సైట్‌లకు లింక్ చేస్తాం. అలాగే మేం కొన్నిసార్లు మా సేవలను వాటిపై అందిస్తాం – ఉదాహరణకు మీరు సోషల్ మీడియాలో మాతో కనెక్ట్ అయినప్పుడు.

గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు:

  • మేం లింక్ చేసిన సైట్‌లను మేం బలపరచం
  • వాటి కంటెంట్‌‌కు మేం బాధ్యత వహించం, వాటిని మీరు ఉపయోగించినపుడు మీకు ఏం జరిగినా దానికి మేం బాధ్యులం కాదు.
  • మీరు లేదా మరెవరైనా ఒక లింక్‌‌ను కలిగి ఉన్న దాన్ని ఏదైనా షేర్ చేస్తే, అది లింక్ చేసే సైట్‌‌లోని దేనికీ మేం బాధ్యత వహించం.
  • వెలుపలి సైట్‌‌లు వాటి సొంత వినియోగ నిబంధనలు, ప్రైవసీ నోటీసులను కలిగి ఉండాలి, అలాంటి వెబ్‌‌సైట్‌లను యాక్సెస్ చేయడానికి ముందుగా వాటిని చదవాలని మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

బీబీసీ నా వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో ఎప్పుడు పంచుకుంటుంది?

మేం మీ సమాచారాన్ని ఇతరులతో ఈ కింది విధాలుగా ఎప్పుడు పంచుకుంటామంటే...

  • మీరు ఏదైనా బహిరంగం చేసినపుడు
  • మా సేవలను బలోపేతం చేయడానికి మేం ఇతర కంపెనీలను ఉపయోగించినపుడు
  • ప్రకటనల కంపెనీలు ప్రకటన స్థలాన్ని కొని, వారి ప్రకటనలను వ్యక్తిగతీకరించినపుడు (పర్సనలైజ్ చేసినప్పుడు)
  • మేం బీబీసీ ఫ్యామిలీలోని కంపెనీలతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటాం
  • మా అధీకృత సర్వీస్ ప్రొవైడర్లు, కలెక్టివ్ న్యూస్‌రూమ్ వంటి మేం కమిషన్ చేసిన పార్టీలతో మేం వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటాం
  • మేం భాగస్వామ్యంతో పరిశోధన చేసినపుడు
  • చట్టం ప్రకారం మేం మీ సమాచారాన్ని ఇతర సంస్థలకు పంపించాల్సి ఉన్నపుడు

నా గురించి సేకరించే ఈ సమాచారాన్ని బీబీసీ ఎంతకాలం నిలుపుకొంటుంది?

మీరు మాకు ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినప్పుడు మా కార్పొరేట్ రిటెన్షన్ షెడ్యూల్‌కు అనుగుణంగా మేం దానిని ఉంచుతాం. మేం ఈ నియమాలను పాటిస్తాం:

  • మేం మీకు చెప్పిన కార్యకలాపాలను చేయడానికి అవసరమైనంత కాలం మాత్రమే లేదా దానిని ఉంచడానికి మాకు సరైన కారణం ఉన్నపుడు మాత్రమే మేం మీ సమాచారాన్ని నిలిపి ఉంచుతాం.
  • అది ఏ రకమైన సమాచారం, ఎంత మొత్తం సేకరించాం, అది ఎంత సున్నితమైనది, ఏవైనా చట్టపరమైన అవసరాలు ఉన్నాయా అనేవాటి గురించి మేం ఆలోచిస్తాం.
  • మీ సమాచారాన్ని మాకు అవసరమైన దానికన్నా, లేదా వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన దానికన్నా ఎక్కువ కాలం ఏమాత్రం మేం నిలిపి ఉంచకుండా చూసేలా మేం మా సేవలను రూపొందించాం.
  • మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం నిలుపుకోవడం గురించి మీరు మమ్మల్ని అడిగినట్లయితే, వర్తించే చట్టం ప్రకారం మాకు అనుమతి ఉంటే, ఆ సమాచారాన్ని మేం మీకు అందిస్తాం.

మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎక్కడ నిల్వ చేస్తాం?

బీబీసీ అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న గ్లోబల్ మీడియా సంస్థ. మాకు సేవలను అందించే కొన్ని కంపెనీలు భారత్, యూకే లేదా యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (ఈఈఏ) వెలుపల నుంచి తమ సేవలను అందిస్తాయి. వారు కల్పించే భద్రతా స్థాయులతో మేం సంతృప్తి చెందినట్లయితేనే మేం అలా జరగనిస్తాం. మీరు మాకు వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినప్పుడు వర్తించే చట్టం ప్రకారం దాని బదిలీపై నిషేధం ఉంటే తప్ప అది భారత్, యూకే లేదా ఈఈఏ వెలుపల ఉన్న ప్రదేశానికి బదిలీ కావచ్చు, అక్కడ నిలిపి ఉండవచ్చు, లేదా ప్రాసెస్ చేయవచ్చునని గమనించండి.

నా హక్కులు ఏమిటి?

మీ వ్యక్తిగత సమాచారం మీ నియంత్రణలోనే ఉందనేది గుర్తుంచుకోండి. మీకు ఈ విషయాలపై హక్కు ఉంది:

  • మీ సమాచారం కాపీని అభ్యర్థించడానికి
  • రోబోట్లు మీ గురించి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా అనుమతి నిరాకరిండానికి
  • తప్పుగా ఉన్న సమాచారాన్ని సరిచేయాలని, దానిని తొలగించాలని లేదా మేం దానిని నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని మమ్మల్ని అడగడానికి
  • మీ మనసు మార్చుకోవడానికి, మీ సమాచారాన్ని ఉపయోగించడం మానేయాలని మమ్మల్ని అడగడానికి. ఉదాహరణకు, ఏవైనా మార్కెటింగ్ ఈ-మెయిళ్ల నుంచి అన్‌సబ్‌స్క్రైబ్ చేయడానికి లేదా వ్యక్తిగతీకరణ (పర్సనలైజేషన్)ను ఆపివేయడానికి
  • వ్యక్తిగతీకరించిన ప్రకటనల కుకీలు, ఇతర ట్రాకింగ్ నుంచి వైదొలగడానికి

కొన్నిసార్లు మేం సహాయం చేయలేకపోవచ్చునని దయచేసి గుర్తుంచుకోండి. అంటే మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఉపయోగించకూడదని చట్టం చెప్పినపుడు, లేదా పాత్రికేయ ప్రయోజనాలు సహా దేని కోసమైనా ఉపయోగించుకోవడానికి మాకు అనుమతిచ్చిన సందర్భాల్లో.

నేను మరింత సమాచారం ఎక్కడ పొందగలను?

బీబీసీ ప్రైవసీ, కుకీస్ పాలసీ పూర్తి భాగాన్ని చూడడానికి, బీబీసీ ప్రైవసీ, కుకీస్ పాలసీ (యూకే వెలుపల) – బీబీసీని ఉపయోగించడం చూడండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని బీబీసీ ఎలా నిర్వహిస్తుందనే దానిపై మీకు ప్రశ్నలు ఉంటే లేదా మీరు మీ హక్కుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను ‌ dataprotection.officer@bbc.co.uk వద్ద సంప్రదించవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఎలా నిర్వహిస్తుందనే దానిపై మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, వారి డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను info@collectivenewsroom.com వద్ద సంప్రదించండి.