BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
వేలానికి ప్రిన్సెస్ డయానా 'రివెంజ్ డ్రెస్', బలమైన సందేశంగా మారిన ఈ దుస్తుల కథేంటి?
‘‘డయానా తన జీవితం అత్యంత చర్చనీయాంశమై, భావోద్వేగభరింగా మారిన సమయంలో ఈ దుస్తులను ఎంచుకోవడం ద్వారా తన గురించి ఇతరులు చెబుతున్న కథనాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ డ్రెస్‌ను తన అత్యంత శక్తిమంతమైన సందేశాల్లో ఒకటిగా డయానా మార్చుకున్నారు’’
బ్రిక్స్: ఈ కూటమితో భారత్‌కు ఎంత ప్రయోజనం? నిపుణులు ఏమంటున్నారు....
‘‘ఒకవేళ బ్రిక్స్ ఎప్పుడైనా సమర్థవంతమైన కూటమిగా మారితే చైనా దానిని స్వప్రయోజనాల కోసం, భారత్‌ను ఏకాకిని చేయడానికి, ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక భాగస్వాములను బలహీనపరచడానికి ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది"
‘‘ఆమె కోసం కోట్లు ఖర్చు పెట్టాను, తిరిగి ఇప్పించండి’’ ప్రియురాలి నుంచి విడిపోయిన తరువాత కోర్టుకెక్కిన వ్యక్తి
‘‘ఖరీదైన బహుమతులు ఇస్తానని అగర్వాల్ అన్నప్పుడు అనేక టెక్స్ట్ మెసేజ్‌ల్లో లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, కొన్ని సందర్భాల్లో వాటిని తీసుకోవడానికి వెనకాడారని కూడా గుర్తించాం''
హూతీల దూకుడుతో ఇరాన్-అమెరికా యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోందా...
''ఇప్పుడు ఇరాన్ నేరుగా, అలాగే తనకు మద్దతిచ్చే వర్గాల ద్వారా ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన రెండు సముద్రమార్గాలను నియంత్రిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధనం, చమురు వ్యాపారంలో 35శాతానికి పైగా ఈ మార్గాలపై ఆధారపడిఉంది''
తిరుమల: ఏడుకొండల వెంకన్న దర్శనానికి 11 దారులు ... మరి ఇన్ని మార్గాలున్నా ఇబ్బందులు ఎందుకు?
‘గోవిందా’ అంటూ నిత్యం వేలమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఎన్నివేలమంది భక్తులు వచ్చినా ఓ నిర్ణీత సంఖ్యను దాటి టీటీడీ దర్శనాలు కల్పించలేదు. మరి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఉన్న మార్గాలేమిటి? దర్శనాల విషయంలో తరచూ వినిపించే విమర్శలేంటి?
జహంగీర్: మద్యానికి బానిసై, అధికారాన్ని భార్య నూర్ జహాన్‌కు వదులుకున్న రాజు కథ..
తీవ్రమైన అనారోగ్య సమయంలో మద్యం తనకు ఉపశమనం కలిగించిందని జహంగీర్ రాశారు. దాంతో ఇంతకుముందు అలవాటు లేని విధంగా పగటిపూట కూడా మద్యం తాగడం ప్రారంభించారు. ఆ తర్వాత మోతాదు క్రమంగా హద్దులు దాటింది.
‘ఆర్మీ ఆయుధాగారం నుంచి తుపాకులు దొంగిలించాడు.. ఊళ్లో గడ్డివాము దగ్గర భూమిలో పాతిపెట్టాడు’
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఉద్యోగం నుంచి తీసేశారనే కోపంతో మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేశ్ ఈ దొంగతనానికి పాల్పడి, ఆయుధాలను తన పెరట్లో పాతిపెట్టాడు. ఇంతకీ ఆయన దొంగతనం ఎలా చేశారు?
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోదా? 2029 వరకు సాగుతుందన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
ఇప్పటికే బ్రెండ్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని దాదాపు అన్ని ప్రధాన అమెరికన్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నాయి.
‘వందల మంది చనిపోయారు, పిల్లలు సహా పారిపోయి వచ్చాం’.
యెమెన్‌లో వ్యూహాత్మక ఎర్ర సముద్ర తీర పట్టణం మోఖాను హూతీ తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకున్నారు. తాజా దాడులతో వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఇళ్లు వదిలి పారిపోతున్నారు. మరోవైపు ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అసలు అక్కడేం జరుగుతోంది?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































