ఇంట్లో వై-ఫై స్లోగా ఉందా? అయితే, ఈ నాలుగు కారణం కావొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, థామస్ జెర్మైన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ప్రపంచమంతా వై-ఫైతోనే నడుస్తుంది. డిజిటల్ ప్రపంచంపై మనం ఆధారపడటం ఎంతలా పెరిగిందంటే, అసలు ఈ ప్రపంచమే వై-ఫైతో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.
కానీ, మీ ఆహారంతో పాటు కొన్ని విచిత్రమైన విషయాలు మీ వై-ఫైకు అడ్డుపడవచ్చు.
అలెక్స్ హిల్స్.. ఈ ప్రపంచంలో వై-ఫై కనెక్షన్‌తో ఇబ్బంది పడిన మొదటి వ్యక్తులలో ఈయనొకరు.
1993లో అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు, ప్రపంచంలోనే తొలి అతిపెద్ద వై-ఫై నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని అభివృద్ధి చేసిన గ్రూప్‌కు నాయకత్వం వహించారు.
'వై-ఫై అండ్ ది బ్యాడ్ బాయ్స్ ఆఫ్ రేడియో' అనే తన పుస్తకంలో హిల్స్ ఈ విషయాలను ప్రస్తావించారు.

కానీ, ఇక్కడ బ్యాడ్ బాయ్స్ అంటే... ఇంటర్నెట్ హ్యాకర్లకు చెందిన తన టీమ్ కాదు.
వై-ఫై మంచిగా పనిచేయకుండా అడ్డుపడుతున్న ఉత్పత్తులు, కార్యకలాపాలకు ఈయన ఈ పేరు పెట్టారు.
మీరు మీమ్స్ చూడకుండా అడ్డుపడుతున్న అలాంటి బ్యాడ్ బాయ్స్' మీ ఇంట్లో కూడా ఉండవచ్చు.
గట్టిగా, మందంగా నిర్మించిన గోడలు లాంటి అడ్డంకుల గురించి విన్నప్పుడు పెద్దగా మీకు ఆశ్చర్యం కలగకపోవచ్చు. కానీ, మరికొన్ని ప్రొడక్టులు, కారకాల గురించి వింటే మాత్రం మీకు కాస్త వింతగానే అనిపిస్తుంది.
ఈ అడ్డంకులు ఏమిటన్నది గుర్తించడం ద్వారా మీ వై-ఫై కనెక్షన్‌ను ఫిక్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇది మాత్రమే కాక.. మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీల్లో ఒకదాని గురించి మీరు ఆలోచించే విధానం కూడా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోవేవ్ ఓవెన్
17 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని రహస్య రేడియో సిగ్నల్స్ విషయంలో తీవ్ర అయోమయంలో పడ్డారు.
కొందరు దీన్ని సౌర జ్వాలలకు ఆపాదించగా.. కొందరు ఈ సిగ్నల్స్‌కు ఏలియెన్స్ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
చివరికి, ఆ సమస్యకు కారణం మరెక్కడో లేదు, తమ ఇంట్లోనే ఉందని వారు గ్రహించారు.
మధ్యాహ్న భోజన సమయంలో ఆఫీసులోని మైక్రోవేవ్ ఓవెన్ నుంచి వెలువడుతున్న శక్తి తరంగాలను వారి టెలిస్కోప్ పట్టుకుంటుందని వారు కనుగొన్నారు.
హానికరమైన మైక్రోవేవ్ శక్తి తరంగాల ద్వారా ప్రభావితమవ్వగల టెక్నాలజీ టెలిస్కోప్‌లు మాత్రమే కాదు. అవి మీ వై-ఫైకు కూడా అంతరాయం కలిగించనున్నాయి.
చాలా వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీల మాదిరిగానే.. రేడియో తరంగాల ద్వారా వై-ఫై సమాచారాన్ని అందిస్తుంది.
ప్రభుత్వాలు చాలా రేడియో ఫ్రీక్వెన్సీలను శాంతిభద్రతల పరిరక్షణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏఎం, ఎఫ్ఎం రేడియో స్టేషన్ల వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేటాయిస్తాయి.
కానీ, కొన్ని ఫ్రీక్వెన్సీలు మాత్రం ఎలాంటి లైసెన్స్ లేకుండా, ప్రజలు ఉచితంగా వాడుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
ఉదాహరణకు.. వై-ఫై నెట్‌వర్క్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు వాడే అత్యంత సాధారణ ఫ్రీక్వెన్సీల్లో ఒకటి 2.4 జీహెచ్‌జెడ్ (2.4 గిగాహెర్ట్జ్).
మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే మీ మైక్రోవేవ్ కూడా ఇదే రకమైన ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది.
ఆహారాన్ని వేడి చేసే తరంగాలను ఆ పరికరం లోపలే ఉంచడానికి మైక్రోవేవ్ ఓవెన్‌ను మంచిగా మూయాలి.
కానీ, మీ వద్ద పాత, పాడైన మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నా.. లేదా వంట పూర్తవక ముందే మీరు దాని తలుపు తెరిచినా.. అది మీ వై-ఫై సిగ్నల్‌కు అంతరాయం కలిగించవచ్చని హిల్స్ అన్నారు.
''ప్రజలు మాట్లాడుకునే అత్యంత ముఖ్యమైన అంతరాయాల్లో ఇదొకటి'' అని హిల్స్ చెప్పారు.
ఫ్లోరోసెంట్ లైట్స్ లేదా కారు ఇగ్నిషన్ సిస్టమ్స్ నుంచి విడుదలయ్యే ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా ఇదే రకమైన సమస్యను మీరు ఎదుర్కోవచ్చు.
''ఇటీవల కాలంలో, మైక్రోవేవ్స్ అంత పెద్ద సమస్య కాదు'' అని హిల్స్ అన్నారు.
వాటిని ఇప్పుడు మరింత మెరుగ్గా తయారు చేస్తున్నారు. అవి 2.4 జీహెచ్‌జెడ్ బ్యాండ్‌కు బదులుగా 5 జీహెచ్‌జెడ్ వై-ఫై బ్యాండ్లు పనిచేయగలవు.
కానీ, మీ వద్ద పాత వై-ఫై సెటప్ ఉన్నా లేదా పాత మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే, ఆహారాన్ని డీఫ్రాస్ట్ చేసే సమయంలో మీరు చూసే మీమ్స్‌కు అంతరాయం కలిగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అక్వేరియం
ఒకవేళ మీ ఇంట్లో చేప పిల్లలు ఉంటే, అవి వై-ఫైకు అంతరాయం కలిగించవచ్చు.
''దూరం పెరుగుతున్న బట్టి రేడియో సిగ్నల్స్ సహజంగానే బలహీనంగా మారుతూ ఉంటాయి'' అని హిల్స్ అన్నారు.
కానీ, కొన్నిసార్లు ఏదైనా ఒక వస్తువులోకి ఈ సిగ్నల్స్ చొచ్చుకుని పోయినప్పుడు, ఆ వస్తువులు సిగ్నల్‌ను బలహీనపరుస్తాయి.
దీన్నే మనం 'షాడోయింగ్' అంటాం'' అని చెప్పారు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వై-ఫై, నీరు ఎప్పటికీ కలవవు.
ఇతర సమస్యల్లో, నీటిలోని అణువులు చిన్న అయస్కాంతాల వలె పనిచేసి రేడియో సిగ్నల్స్ శక్తిని గ్రహిస్తాయి.
మీకు, మీ రౌటర్‌కు మధ్య చేపల తొట్టి (అక్వేరియం) ఉంటే, అది ఆ ప్రాంతంలో వై-ఫై అందుబాటులో లేకుండా చేయొచ్చు.
వై-ఫై నెట్‌వర్క్‌ల విషయంలో ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య 'షాడోయింగ్' అని హిల్స్ చెప్పారు. ఇవి కేవలం అక్వేరియం వల్ల మాత్రమే జరగవన్నారు.
రేడియో తరంగాలు కలప, గోడలు వంటి కొన్ని పదార్థాల గుండా వెళ్తాయి.
కానీ, గోడలు కనుక ఇటుక లేదా కాంక్రీట్ వంటి మెటీరియల్స్‌తో గట్టిగా కడితే, వాటిలో వెళ్లడం రేడియో తరంగాలకు కష్టమవుతుంది.
ఆ సిగ్నల్ గదిలోని వస్తువులపై పడి బౌన్స్ అవుతూ,ప్రయాణించడానికి మరొక మార్గాన్ని కనుగొనగలదు. . కానీ, అది ప్రయాణించే మార్గంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటే, అది ముందుకు సాగడం అంత కష్టమవుతుంది.
దూరం తక్కువగా ఉంటే, వై-ఫై సిగ్నల్ సులభంగా చేరుతుంది. అందుకే, మీ రౌటర్‌ను ఇంటి మధ్యలో, వీలైనంత ఎత్తులో ఉంచడం మంచిది.
ఒకవేళ అది పని చేయకపోతే, మీ సిగ్నల్ పరిధిని పెంచే వై-ఫై ఎక్స్‌టెండర్‌ను ఉపయోగించాలి. లేదా మీ రౌటర్‌కు బదులుగా మెష్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
మెష్ నెట్వర్క్ చిన్న చిన్న డివైజ్‌ల ద్వారా మీ ఇళ్లంతా వై-ఫై వెళ్లేలా చేస్తుంది.
అప్పుడు, ఈ చేపల అక్వేరియంతో మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
గాజు అద్దాలు
మైక్రోవేవ్ ఓవెన్లు మీ వై-ఫై సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించగలవు. అక్వేరియాలు ఆ సిగ్నల్స్‌ను గ్రహించి, అడ్డుకుంటాయి. వీటితో పాటు వై-ఫై సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించే మరో సాధారణ సమస్య ఉంది. అదేంటంటే.. పరావర్తనం.
అద్దాలు వంటి పరావర్తన ఉపరితలాలపై (రిఫ్లెక్టివ్ సర్ఫేస్‌లపై) కాంతి పడి ఎలాగైతే పరావర్తనం చెందుతుందో, అలాగే మీ వై-ఫై సిగ్నల్ కూడా పరావర్తనం చెందవచ్చు (రిఫ్లెక్ట్ అవ్వొచ్చు).
టెలివిజన్ వంటి ఏదైనా ఫ్లాట్‌గా ఉండే, పరావర్తన ఉపరితలం కూడా ఇదే రకమైన సమస్యను సృష్టించగలదు. మెటల్ షీట్లతో గోడలను కట్టినప్పుడూ ఇదే రకమైన సమస్యను ఎదుర్కోవచ్చు.
మీ ఇంట్లో వై-ఫై సిగ్నల్ ఏరియాలో, మీకు, మీ రౌటర్‌కు మధ్యలో ఏదైనా లైన్ ఉందేమో ఆలోచించండి.. సిగ్నల్‌ను రీడైరెక్ట్ చేయగలిగే అతిపెద్ద టీవీ లేదా అద్దం ఉందేమో చూడండి..
అలాంటి వస్తువులను మరో ప్రాంతానికి తరలించడం మంచిది. మీ ఇంటి లేవుట్‌ను మార్చాలనుకోకపోతే, వై-ఫై ఎక్స్టెండర్నే దీనికి పరిష్కారాన్ని అందించగలదు.

ఫొటో సోర్స్, Getty Images
మంచు
మధ్యలో ఖాళీ స్థలంతో వేరుగా ఉండే భవనంలోని నెట్‌వర్క్‌ను మీ గది నుంచి ఉపయోగిస్తుంటే తప్ప, వర్షం మీ వై-ఫైకి అంతరాయం కలిగించదు.
కానీ, వాతావరణం బాగా దెబ్బతిన్నప్పుడు, పరిస్థితులు తలకిందులు కావచ్చు.
మంచువర్షం ఒక ఇంటికి, ఒక ప్రాంతానికి, లేదా మొత్తం నగరానికి సేవలు అందించే మౌలిక సదుపాయాలను స్తంభింపజేయగలదు.
విపరీతమైన చలి కేబుళ్ల లోపల ఉన్న లోహానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది, లేదా మంచు పేరుకుపోయి శాటిలైట్ సంకేతాలకు అడ్డుపడుతుంది.
వేడి కూడా ఇదే రకమైన సమస్యలను సృష్టించగలదు.
అయితే, వాతావరణం ఒక్కటే సమస్య కాదు. ఒకేసారి ఇంట్లో వారందూ యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా మీ నెట్వర్క్ స్పీడ్లు తగ్గిపోతాయి.
అంటే, మీరు చూస్తున్న మీమ్స్‌కు అంతరాయం కలిగేందుకు వాతావరణ మార్పు కూడా మరో కారణం కావొచ్చు.
దీనికి పరిష్కారమేంటి?
ఈ విశ్వాన్ని మీరు పరిరక్షించాలంటే.. టెలికమ్యూనికేషన్ కంపెనీలు, స్థానిక అథారిటీలు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారిని మీరు డిమాండ్ చేయొచ్చు.
అలెక్స్ హిల్స్ ప్రస్తుతం అలస్కాలో నివసిస్తున్నారు.
ఇంటర్నెట్ను మారుమూల ప్రాంతాలకు, గ్రామాలకు తీసుకెళ్లేందుకే ఆయన జీవితంలో చాలా భాగాన్ని వెచ్చించారు.
శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు దీన్ని మరింత సులభతరం చేశాయి. కానీ, వాటికి కూడా వై-ఫై ''బ్యాడ్ బాయ్స్'' ఉంటాయి.
కొన్నిసార్లు మంచు తుపాను సమయంలో, మీ శాటిలైట్ డిష్ అంతా మంచుతోనే మూసుకుపోతుంది. అలాంటి పరిస్థితిలో మీరు, ఒక వస్త్రాన్ని తీసుకుని, దాన్ని శుభ్రపరచాలి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























