బ్రిక్స్ సదస్సు విశేషాలు 7 ఫోటోలలో

ఫొటో సోర్స్, PIB
న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం బ్రిక్స్ మొదటి రోజు సదస్సు ప్రారంభమైంది.
సదస్సు మొదటి రోజున వివిధ దేశాల నేతలంతా కలిసి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన 'భారత్ ఇన్నోవేట్స్' డీప్-టెక్ ప్రదర్శనను తిలకించారు.
ఆ తర్వాత ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా అగ్రనేతలందరూ కలిసి సంయుక్తంగా మొక్కలు నాటారు.

ఫొటో సోర్స్, PIB

ఫొటో సోర్స్, PIB

ఫొటో సోర్స్, PIB
ప్రధాని మోదీ విదేశీ అతిథులకు విలాసవంతమైన విందు (గాలా డిన్నర్) ఇచ్చారు.
ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లతో పాటు బ్రిక్స్ కూటమిలోని 11 సభ్య దేశాల అగ్రనేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు దిల్లీకి తరలివచ్చారు.
ముఖ్యంగా ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు వచ్చారు, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, X/narendramodi

ఫొటో సోర్స్, ANI
బ్రిక్స్ సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా న్యూదిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపాయి. యుద్ధాల కంటే చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























