ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన మహిళ: ‘‘నా పిల్లల ఫీజుల కోసమే నా పరుగు’’ అంటున్న విజేత రమాబాయి

వీడియో క్యాప్షన్,
ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన మహిళ: ‘‘నా పిల్లల ఫీజుల కోసమే నా పరుగు’’ అంటున్న విజేత రమాబాయి
ప్రచురణ

చీర కొంగును నడుముకు చుట్టుకుని, కాళ్లకు కూడా చెప్పులు లేకుండా పరుగెత్తి మారథాన్‌లో గెలిచారు రమాబాయి రణ్‌వీర్.

కూతుళ్ల చదువులకు ఫీజులు కట్టడం కోసం మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగాయ్‌లో జరిగిన 'అమృత్ దౌడ్' మారథాన్‌లో ఆమె పాల్గొన్నారు.

దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. ఆమె దగ్గర కనీసం స్పోర్ట్స్ షూ కూడా లేవు. చీర కట్టుకుని, స్లిప్పర్స్ వేసుకుని పరుగెత్తారు.

మధ్యలో స్లిప్పర్లు జారిపోతుండటంతో, వాటిని చేతిలో పట్టుకుని మిగిలిన పందెం పూర్తి చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)