విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో భారీ ప్రమాదం.. ఉక్కు ద్రవం పడి మంటలు, పలువురు కార్మికులు మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు అధికారుల నుంచి తనకు సమాచారం అందిందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ‘బీబీసీ’తో చెప్పారు. మృతుల సంఖ్య పెరగొచ్చన్నారు.

ప్లాంట్ ఎస్ఎంఎస్‌ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలాయి. దీంతో ఉక్కు ద్రవం పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం.

భారీగా మంటలు చేలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో కొందరు కార్మికులు మరణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

మరోవైపు హోం మంత్రి అనిత .. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.

సహాయ చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)