లైవ్, కాక్రోచ్ జనతా పార్టీ: సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న సీజేపీ

‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్నసెటైర్‌ను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సారాంశం

  • నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని సీజేపీ ప్రకటన
  • జాతీయ జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని పిలుపు
  • దిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
  • శాంతియుతంగా నిరసన చేద్దామంటూ మద్దతుదారులకు పిలుపు
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరననకు సిద్ధమైన సీజేపీ

లైవ్ కవరేజీ

  1. ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?

  2. నిరసనకు దిల్లీ పోలీసుల అనుమతి దొరికిందని సీజేపీ ప్రకటన

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఫొటో క్యాప్షన్, ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి

    జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించబోయే నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

    ఈ నేపథ్యంలో ముందు ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మద్దతుదారులంతా జంతర్ మంతర్ వద్దకే రావాలని కోరింది.

    అలాగే, 10 గంటల నుంచి శాంతియుత నిరసన మొదలుపెడదామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ట్వీట్ చేశారు.

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఎలా ఉందో కింది ఫోటోల్లో చూడండి.

    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
    ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి
  3. సీజేపీ ధర్నా: ‘పూలు, పుస్తకాలు, జాతీయజెండా తీసుకురండి’’ అంటూ పిలుపు

    సీజేపీ పార్టీ ప్రతినిధులు

    ఫొటో సోర్స్, x/Cockroachisback

    ఫొటో క్యాప్షన్, సీజేపీ ప్రతినిధులు

    జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

    తమతో పాటు తిరంగా జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించుదామని ఎక్స్‌ వేదికగా ఒక వీడియోలో పేర్కొన్నారు.

    మద్దతుదారులు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని కోరారు.

    ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే దిల్లీ పోలీస్‌కు రిపోర్ట్ చేయాలని, తమ ఫోన్లను ఆన్‌లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

    ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ధ్రువ్ రాఠీ కూడా ఎక్స్‌లో ఒక వీడియో పెట్టారు.

    ధ్రువ్ రాఠీ

    ఫొటో సోర్స్, x/DhruvRathee

    ఫొటో క్యాప్షన్, ధ్రువ్ రాఠీ
  4. సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న కాక్రోచ్ జనతా పార్టీ

    అభిజిత్ దీప్కే

    ఫొటో సోర్స్, X/Cockroachisback

    దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరనస తెలిపేందుకు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు సీజేపీ యోచిస్తోంది.

    ఈ మేరకు జూన్ 5న ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఎక్స్ హ్యాండిల్‌ ఒక పోస్ట్ చేసింది. అందులో తమ ప్రణాళికను పంచుకుంది.

    ‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్న తమాషాను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.