పోలీసుల అదుపులో నేహా బోరా

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పలువురు నిరసనకారులను ప్రత్యేకబస్సులో రహస్య ప్రదేశానికి తరలిస్తున్నారు. అంతకుముందు దిల్లీ హట్ దగ్గర కలుసుకుందామని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
"ఇప్పుడు దిల్లీహట్ జంతర్ మంతర్ అయ్యింది! అక్కడ కలుద్దాం!’’ అని ఆమె ఆ పోస్ట్‌లో రాశారు.
ఈ పోస్ట్ తర్వాత నేహా బోరా దిల్లీహట్‌లో నిరసన తెలుపుతూ కనిపించారు.
నేహాబోరాతోపాటు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, దీపాంకర్ భట్టాచార్యలను సఫ్దర్ జంగ్ ఫ్లై ఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారని బీబీసీ కరస్పాండెంట్ దిల్ నవాజ్ పాషా చెప్పారు.
ఆమె వెంట సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక-రాజకీయ కార్యకర్త యోగేంద్ర ఉన్నారు.

















