దిల్లీ : 12 ఫోటోలలో సీజేపీ ఆందోళన

జంతర్ మంతర్, భద్రత
ఫొటో క్యాప్షన్, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న భద్రతా బలగాలు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపిచ్చిన ఆందోళనలో పాల్గొనడానికి వేలాది మంది దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. కొంతమందిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

దిల్లీలో యుద్ధ వాతావరణం ఉన్నట్లుగా పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 'ఎక్స్'లో రాశారు.

"దిల్లీలో అనేక చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఉన్నాయి, రోడ్లపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా నగరం అంతటా 22,000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారు" అని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తెలిపారు.

దిల్లీ నుంచి రాకపోకలు సాగించే 250 రైళ్లను రద్దు చేశారు. 52 మెట్రో స్టేషన్లను మూసివేశారు.

దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, ఆందోళనలో పాల్గొన్న ఓ యువతిని అదుపులోకి తీసుకున్న తర్వాత బస్సులోకి ఎక్కించి తీసుకెళుతున్న పోలీసులు
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడిని చొక్కా పట్టుకుని లాక్కెళుతున్న పోలీసు
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, న్యూస్ లాండ్రీ, స్క్రోల్ పత్రికలకు చెందిన జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులతో పాటు కొంతమంది జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులలో న్యూస్‌లాండ్రీ, స్క్రోల్.ఇన్, నవభారత్ టైమ్స్‌కు చెందినవారు ఉన్నారు.

"జర్నలిస్టులు తాము మీడియాకు చెందినవారమని చెప్పినప్పుడు, అక్కడ మీడియా అనేదే లేదని వారికి చెప్పారు. జర్నలిస్టుల వద్ద నుంచి ఫోన్లను కూడా లాక్కున్నారు. నిరసనకారులు, జర్నలిస్టులతో సహా సుమారు 30 మందిని ఒకే బస్సులో కూర్చోబెట్టారు" అని న్యూస్‌లాండ్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.

జంతర్ మంతర్ ధర్నా
ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన యువతిని నిర్బంధంలోకి తీసుకుని బస్సులో తరలించారు
"దిల్లీలో అనేక చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఉన్నాయి, రోడ్లపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు.
ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనత పార్టీ మద్దతు పలకడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్‌లో తరలించారు
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో అనేక ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, దిల్లీలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత, రైలు సర్వీసుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అధికారులు ఉల్లంఘించారని పిటిషన్‌లో ఆరోపించారు.
దిల్లీ ఆందోళనలు, కాక్రోచ్ జనతా పార్టీ, జ్ఞానేశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ
ఫొటో క్యాప్షన్, కొన్ని మెట్రో స్టేషన్ల మూసివేత, కొన్ని చోట్ల ప్రజా రవాణాను నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)