కన్నీళ్లు, సంబరాలు, సెల్ఫీలు: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల రియాక్షన్లు.. 13 ఫోటోలలో

నవంబర్ 3, 2026న టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని లాంగ్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల రాత్రి వీక్షణ కార్యక్రమంలో డెమొక్రాట్ సెనెటోరియల్ అభ్యర్థి జేమ్స్ తలారికో మద్దతుదారులు ప్రారంభ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

రిపబ్లికన్ల కంచుకోటలలో డెమొక్రాట్లు వరుస విజయాలు సాధించి, సెనేట్, ప్రతినిధుల సభలను కైవసం చేసుకోవడంతో చాలా ప్రాంతాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆలింగనాలు, కేరింతలు, చిరునవ్వులు చిందిస్తూ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయంతో డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసేంత వరకు కాంగ్రెస్‌పై వారికి పట్టు లభిస్తుంది.

ఈ ఫలితాలతో రిపబ్లికన్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారికి బలమైన మద్దతుంటుందని భావించే రాష్ట్రాల్లో కూడా వారికి ఓటములు ఎదురయ్యాయి.

జార్జియా డెమొక్రటిక్ గవర్నర్ అభ్యర్థి, అట్లాంటా మాజీ మేయర్ కీషా లాన్స్ బాటమ్స్
ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు తెలిపిన రిపబ్లికన్ అభ్యర్థి, వ్యాపారవేత్త రిక్ జాక్సన్‌ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ ఓడించారు. జార్జియా గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ బాటమ్స్.
అమెరికా, ఒహాయో
ఫొటో క్యాప్షన్, డెమొక్రాట్ అభ్యర్థి షెరాడ్ బ్రౌన్ చేతిలో ఓడిపోయిన రిపబ్లికన్ సెనేటర్ జాన్ హస్టెడ్ తన కుటుంబ సభ్యుల మధ్య కన్నీరు కార్చారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలు,అమెరికా సెనేటర్ జాన్ ఓసాఫ్
ఫొటో క్యాప్షన్, జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ ఒసాఫ్ మరోసారి ఎన్నికై సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
జార్జియా, జాన్ ఓసాఫ్
ఫొటో క్యాప్షన్, 2028లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున జాన్ ఒసాఫ్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగే ప్రముఖ నేతల్లో ఒకరిగా భావిస్తున్నారు.
టెక్సస్ సెనేటర్-ఎలెక్ట్ జేమ్స్ తలారికో, గవర్నర్-ఎలెక్ట్ గినా హినోజోసా
ఫొటో క్యాప్షన్, అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో డెమొక్రటిక్ పార్టీ సెనేట్ అభ్యర్థి ట్రాయ్ జాక్సన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా సెనేటర్‌గా ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి సుసాన్ కాలిన్స్‌ను ఆయన ఓడించారు.
అయోవాలోని డెస్ మోయిన్స్‌లో, హిల్టన్ డెస్ మోయిన్స్ డౌన్‌టౌన్‌లో
ఫొటో క్యాప్షన్, ఐయోవాలోని డెస్ మోయిన్స్‌లో మధ్యంతర ఎన్నికల ఫలితాలను నిరాశగా చూస్తున్న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు.
న్యూ హాంప్‌షైర్ డెమొక్రాట్, యూఎస్ సెనేట్ అభ్యర్థి, ప్రతినిధి క్రిస్ పాప్పాస్, న్యూ హాంప్‌షైర్‌, మాంచెస్టర్‌
ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్ సెనేటర్ జాన్ సునునును ఓడించి, సెనేట్‌కు ఎన్నికైన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా డెమొక్రాట్ క్రిస్ పాప్పాస్ చరిత్ర సృష్టించారు.
డెమొక్రాటిక్ యూఎస్ సెనేట్ అభ్యర్థి, యూఎస్ ప్రతినిధి క్రిస్ పాప్పాస్, తన భర్త వాన్ బెంట్లీతో
ఫొటో క్యాప్షన్, పాప్పాస్ తన భర్త(ఎడమవైపు వ్యక్తి) తో కలిసి వేదికపై సంబరాలు జరుపుకున్నారు.
నార్త్ కరోలినా
ఫొటో క్యాప్షన్, డెమొక్రటిక్ పార్టికి చెందిన అమెరికా మాజీ గవర్నర్ రాయ్ కూపర్ రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ వాట్లీపై విజయం సాధించారు.
డెమొక్రటిక్ పార్టీ
ఫొటో క్యాప్షన్, నార్త్ కరోలినాలో విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న ఓ మద్దతుదారు.
మిషిగన్‌ డెమొక్రాట్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్
ఫొటో క్యాప్షన్, మిషిగన్‌లో డెమొక్రాట్ అబ్దుల్ ఎల్-సయీద్ అమెరికా తొలి ముస్లిం సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
టెక్సాస్‌లోని డల్లాస్‌, ది వెస్టిన్ గ్యాలెరియాలో, రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి, టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్
ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో వరుస ఓటములు ఎదురవడంతో ఆ పార్టీ మద్దతుదారుల్లో నిరాశ కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)