హరీశ్ రావు: అసెంబ్లీ ఎదుట బనియన్‌తో నిరసన

వీడియో క్యాప్షన్, టీ షర్టు విప్పి.. బనియన్‌తో హరీశ్ రావు నిరసన | BBC Telugu
హరీశ్ రావు: అసెంబ్లీ ఎదుట బనియన్‌తో నిరసన
ప్రచురణ

బ్లాక్ టీ షర్టు విప్పి..బనియన్‌తో అసెంబ్లీ ముందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నిరసన తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులతో అసెంబ్లీ దగ్గరికి వచ్చారు.

ఆ టీ షర్టులపై "హామీల అమలులో కాంగ్రెస్ విఫలం" తదితర నినాదాలు ఉన్నాయి. అయితే, బ్లాక్ టీషర్టులు ధరించిన తమను అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది.

అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తెలంగాణ భవన్‌కు తరలించారు. నల్లచీరలు ధరించిన మహిళా నేతలను కూడా పోలీసులు తెలంగాణ భవన్‌కు తరలించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏదో జరిగిపోయినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రామా చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)