ఆంధ్రప్రదేశ్‌: ఫుల్ ట్యాంక్, నో స్టాక్.. పెట్రోల్, డీజిల్ బంకుల్లో పరిస్థితి 9 ఫోటోలలో

పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని దొండపర్తిలో పెట్రోల్ కోసం వాహనదారుల క్యూ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు.

ప్రతి ఒక్కరూ ‘ఫుల్ ట్యాంక్’ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు.

మరోవైపు రైతులూ డీజిల్ కోసం క్యాన్లతో బంకులకు క్యూ కట్టారు.

మరోపక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, గన్నవరం
ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లా ఆకువీడులో డీజిల్‌ కోసం బంకు వద్ద రైతుల ఎదురు చూపులు

గోదావరి జిల్లాల్లో వరి రైతులు, ఆక్వా సాగుదారులు డీజిల్‌ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విజయవాడ ఆటో నగర్‌లోని ఓ బంక్‌లో మంగళవారం వాహనాల రద్దీ
పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విజయవాడ ఆటోనగర్ పెట్రోల్ బంక్ వద్ద నో స్టాక్ బోర్డ్
పెట్రోల్, డీజిల్, ఇరాన్,అమెరికా
ఫొటో క్యాప్షన్, ముందు జాగ్రత్తగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నామని కొందరు వాహనదారులు చెప్పారు.
పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విజయవాడలోని గవర్నర్ పేట పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేకపోవడంతో ఖాళీగా ఉంది
పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, విశాఖ అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద వాహనాల క్యూ
పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, పెట్రోల్ కొరత లేదని చెబుతూ, విశాఖ జాతీయ రహదారిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మేనేజ్‌మెంట్ పెట్టిన బోర్డు.

డబ్బులు కడితే కానీ రిఫైనరీలు ట్యాంకులు పంపడం లేదని దొండపర్తిలోని బంకు యజమాని కృష్ణారావు అంటున్నారు.

గతంలో క్రెడిట్‌పై ఇచ్చేవారని, ఇప్పుడలా లేదని, అదే ఈ పరిస్థితికి కారణమని ఆయన అన్నారు.

పెట్రోల్, డీజిల్, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, మంగళవారం విశాఖపట్నంలోని దొండపర్తిలో పెట్రోల్ బంకు వద్ద వాహనదారుల క్యూ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.