ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. రాహుల్ గాంధీ ధర్నాకు దిగగానే మోదీ ప్రభుత్వంలో మంత్రులు చర్చల కోసం ఎందుకు వచ్చారు?

  2. ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు

  3. షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు

  4. కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’

    సౌరవ్ దాస్

    ఫొటో సోర్స్, ANI/X

    ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

    ‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.

    తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?

  6. సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ

  7. ‘రాహుల్ గాంధీతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’

    తమిళనాడు

    ఫొటో సోర్స్, R. Satish BABU / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం విజయ్

    లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ పార్టీ ఖండించింది.

    రాహుల్ గాంధీని నిర్బంధించి, చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా చేసిన దాడని తమిళగ వెట్రి కళగం(టీవీకే)ఆరోపించింది.

    ‘‘దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి. నీట్ పరీక్ష విశ్వసనీయత మొదటినుంచీ ప్రశ్నార్థకంగా ఉంది. విద్యార్థులపై నిరంతర మానసిక ఒత్తిడి పెరిగింది. వారి కలలు ప్రశ్నార్థకంగా మారాయి. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి ’’ అని టీవీకే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

  8. ‘18 నెలలు ప్రయత్నించినా పిల్లలు కలగలేదు’.. మగవాళ్లలో సంతానలేమి సమస్యలను పెద్దగా పట్టించుకోరెందుకు

  9. అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

    రాహుల్

    ఫొటో సోర్స్, https://x.com/RahulGandhi

    ఫొటో క్యాప్షన్, ఛత్రసాల్ స్టేడియంలో రాహుల్ గాంధీ

    ప్రధాని ఇంటి ముందు మంగళవారం చేపట్టిన ధర్నా, తనను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం తరువాత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    పోలీసులు తనను ఉంచిన ఛత్రసాల్ స్టేడియంలో రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఒక కాలికి మాత్రమే షూ వేసుకుని కనిపించారు.

    ‘సోమవారం జరిగిన ఘటనలపై చర్చకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని తర్వాత స్పష్టమైంది. దీంతో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలని, విద్యార్థుల సమస్యలు, దేశంలోని సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నాం.

    భారత విద్యావ్యవస్థ ఎందుకు నాశనమైంది, పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి?విద్య ఎందుకు భారత్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది, పిల్లలను చదివించడానికి ప్రజలు ఆర్థికంగా ఎందుకు పూర్తిగా నష్టపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పూలేదు.

    విద్యార్థులు కోరినట్టుగా అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ మొత్తం వ్యవహారంపై

    పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరపాలి.

    ప్రతిపక్షనేతగా నేను ప్రధాని మోదీకి ఓ సలహా ఇస్తున్నా. సోమవారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థల్లో వీలయినంత తొందరగా సంస్కరణలు తేవాలి.

    విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు.

  10. రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?

  11. రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

    Dharmendra Pradhan

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

    మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.

    ‘పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.

    ‘నీట్ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు కాదు’ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్.

    విద్యార్థుల సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.

  12. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.

  13. ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ గాంధీ, అఖిలేష్ సహా పలు ప్రతిపక్ష నేతల తరలింపు, కొందరి విడుదల

    అఖిలేష్ యాదవ్

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.

    లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు వీరంతా ధర్నా చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విపక్ష నేతలలో కొందరిని ఈ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    ఛత్రసాల్ స్టేడియంలో కాసేపు ఉంచిన తర్వాత పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. "ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలి. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. వారిని కొట్టారు, తలలు పగలగొట్టారు.. చివరికి విద్యార్థినుల బట్టలు కూడా చింపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నుంచి ఆశించే ప్రవర్తన ఇదేనా? మేం ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతాం" అని స్పష్టం చేశారు.

    కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మన దేశ భవిష్యత్తైన పిల్లల మాట వినడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? వారి డిమాండ్ చాలా న్యాయమైంది. ప్రజాప్రతినిధులుగా వారి గొంతుకను వినిపించడం, బలోపేతం చేయడం మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. ఎక్కడ అవసరమైతే అక్కడ మా గొంతు వినిపిస్తాం. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి మేం ఒకే మాటపై ఉన్నాం. కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక బిల్లును ఎందుకు తీసుకురావడం లేదు?" అని తెలిపారు.

    "ప్రభుత్వం నిన్న తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ రోజు కూడా అదే క్రూరత్వాన్ని పునరావృతం చేసింది. వీరు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకులు. జితేంద్ర సింగ్ మాకు నోటీసు ఇవ్వమని, ఆ తర్వాత చర్చ గురించి ఆలోచిస్తామని చెప్పారు; కానీ మాకు అది ఇష్టం లేదు. మేం నిన్న నోటీసు ఇచ్చాం, ఈ రోజు కూడా ఇచ్చాం" అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం

  15. ప్రధాని నివాసం వద్ద ధర్నా: రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Congress/X

    దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Congress/X

    ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. "ఇది ముగింపు కాదు, రాహుల్ గాంధీ నాయకత్వంలో సరికొత్త విప్లవానికి ఇది ఆరంభం మాత్రమే. వాళ్లు మమ్మల్ని జైల్లో పెట్టవచ్చు, లాఠీఛార్జ్ చేయవచ్చు, లేదా వేధించవచ్చు. కానీ, పేపర్ లీకుల వల్ల భవిష్యత్తును కోల్పోయి, తమ కుటుంబాల ఆశలు ఆవిరైపోయిన భారతదేశంలోని కోట్లాది మంది బిడ్డలకు మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాల్సింది" అన్నారు.

  16. నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?

  17. ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ

    ప్రధాని నివాసం, రాహుల్ గాంధీ ధర్నా, కాంగ్రెస్

    ఫొటో సోర్స్, @INCIndia

    ఫొటో క్యాప్షన్, దిల్లీలోని '7 లోక్ కళ్యాణ్ మార్గ్‌' వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు

    దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలవడానికి కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ధర్నా స్థలం నుంచి వస్తున్న దృశ్యాలలో జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మాట్లాడుతుండటం కనిపించింది.

    రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ "నిన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టేందుకు మేం ఆయన ఇంటి వరకు మార్చ్ నిర్వహించాం. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదు. పార్లమెంట్‌లో దీనిపై చర్చను కూడా కోరుకోవట్లేదు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి" అని తెలిపారు.

    మరోవైపు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను కొనసాగిస్తోంది. సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' పై సోమవారం లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు.

    ఈ నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి ఒక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ప్రధాని మోదీ నుంచి నేరుగా రాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా వచ్చింది.

  18. 'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'

  19. బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్నామ్, మొదటి ప్రసంగంలో ఏమన్నారంటే..

  20. నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ ప్రకటన