రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

ఫొటో సోర్స్, Dilip Yadav
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.
చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.
రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్ఎస్ రిపోర్టు చేసింది.
ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.





