హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర నేడు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (నవంబరు 2, మంగళవారం) హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మహా పాదయాత్ర’ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాకుచెప్పారు.
‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ బీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని పారదోలండి’’ నినాదంతో పాదయాత్ర చేస్తున్నారు.
మొదట అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 4 గంటలకు బషీర్‌బాగ్‌లోని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకుని.. ఎంజె మార్కెట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడతారని బీజేపీ తెలంగాణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, @kishanreddybjp
పాదయాత్ర జరిగే రూట్ మ్యాప్‌ను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పరిశీలించారు.
మరోవైపు అమిత్ షా పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
‘‘తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల విషయంలో అమిత్ షా గతంలో అవమానకరంగా మాట్లాడారు. హైదరాబాద్ రావడానికి ముందుగానే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పాక హైదరాబాద్ కు రావాలి.’’ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు.




