గుడి మెట్లమార్గంలో వెళ్తున్న బాలుడిని లాక్కెళ్లిన సింహం

వీడియో క్యాప్షన్, గుడి మెట్లపై వెళ్తున్న బాలుడిని లాక్కెళ్లిన సింహం
గుడి మెట్లమార్గంలో వెళ్తున్న బాలుడిని లాక్కెళ్లిన సింహం
ప్రచురణ

గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ గుడి మెట్ల దారిలో 11 ఏళ్ల బాలుడిని సింహం అడవుల్లోకి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలివి. తర్వాత ఆ బాలుడి బూట్లు, దుస్తులు, శరీర అవశేషాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

గిర్నార్‌ మెట్ల మార్గంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల్లో.. జులై 11న ఉదయం 4 గంటల 26 నిమిషాలకు బాలుడు తన చిన్నాన్నతో కలిసి మెట్లు ఎక్కడం కనిపించింది.

సుమారు 4 గంటల 33 నిమిషాల సమయంలో బాలుడిపై సింహం దాడి చేయడంతో భక్తుల్లో కలకలం రేగింది. ఈ దృశ్యాల్లో భక్తులు తర్వాత మెట్లవైపు పరుగెత్తుకుని రావడం కనిపించింది.

సింహం దాడి తర్వాత.. అటవీశాఖ అధికారులు, పోలీసులు, ట్రాకర్స్ వెంటనే రంగంలోకి దిగారు. ఒక సింహాన్ని బోనులో బంధించారు.

సింహం, గుజరాత్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)