వాట్సాప్ ప్లస్: ఇది వాడుకున్నందుకు డబ్బు చెల్లించాలా? 7 ప్రశ్నలు - సమాధానాలు

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

వాట్సాప్ వినియోగదారులు డబ్బు చెల్లించి అదనపు సేవలు పొందేందుకు వీలుగా మెటా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

వాట్సాప్ ప్లస్ పేరుతో అందించే ఈ సర్వీసులను మెటావన్ ప్రోగ్రామ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

వాట్సాప్‌ మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కోసం కూడా ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ అనే సేవలను అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది.

భారత్‌లో 85 కోట్లకు పైగా వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయని వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్‌సైట్ నివేదిస్తోంది. మెటాకు భారత్ అతిపెద్ద మార్కెట్ కూడా.

వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవడానికి ఇకపై చెల్లింపు అవసరం అన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. మరి ఆ కొత్త ఫీచర్ ఏంటి? మెసేజ్‌లకు కూడా డబ్బు చెల్లించాలా? ఇది ఎవరికి వర్తిస్తుంది? అందులో ఏయే ఫీచర్లు ఉంటాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొత్త ఫీచర్

ఫొటో సోర్స్, Getty Images

మెటా వన్‌కు సంబంధించి ఆ కంపెనీ ప్రొడక్ట్ హెడ్ అయిన నవోమి క్లైడ్ కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ప్రకటన పోస్ట్ చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టిన సేవలు దశలవారీగా భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి దేశానికి కొన్ని స్థానిక చట్టాలు, అవసరాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఈ ఫీచర్లు ప్రాంతాల వారీగా మారవచ్చు, అప్‌డేట్ కావచ్చు" అని ఫ్యాక్ట్ చెకింగ్ ఎక్స్‌పర్ట్ మురళీకృష్ణన్ చిన్నదురై అన్నారు.

ఇప్పటివరకు ప్రకటించినవి కేవలం ప్రాథమిక ఫీచర్లు మాత్రమే. వాట్సాప్‌లో ప్రస్తుతం అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ వీటిని తొలగిస్తుందో లేదో చూడాలి.

వాట్సాప్

వాట్సాప్ యాప్‌కు ఇప్పటికే అనేక అదనపు ఫీచర్లు జోడిస్తున్నారు. ఈ సేవను దశలవారీగా విడుదల చేస్తున్నందున, కొన్ని ఫీచర్లు తర్వాత అందుబాటులోకి రావచ్చని మెటా చెబుతోంది.

వాట్సాప్

ఈ సేవలకు మొబైల్ ఫోన్‌లోని వాట్సాప్ మెసెంజర్‌లో మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకోవడం కుదరదు.

వాట్సాప్ బిజినెస్ యాప్స్, అకౌంట్స్‌కు వాట్సాప్ ప్లస్ అందుబాటులో ఉండదు.

ఒక వాట్సాప్ అకౌంట్‌కు ఒక వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే ఉంటుంది.

మొబైల్ ఫోన్‌

ఫొటో సోర్స్, Getty Images

వాట్సాప్

వాట్సాప్ ప్లస్ ఫీచర్ మొదలవుతున్న దేశంలో మీకు స్థానిక మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. వాట్సాప్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి.

వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అక్కడ సబ్‌స్క్రిప్షన్స్ అనే ఆప్షన్ ఉందో లేదో చూడాలి. అక్కడే వాట్సాప్ ప్లస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత, మీరు వాట్సాప్ సెట్టింగ్స్ ----> సబ్‌స్క్రిప్షన్ ----> వాట్సాప్ ప్లస్‌లో ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు.

వాట్సాప్

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. మెసేజింగ్‌వంటి ప్రాథమిక వాట్సాప్ సర్వీసులకు రుసుము ఉండదు.

దానికి బదులుగా, కొన్ని అదనపు, స్పెషల్ ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫీచర్ పొందవచ్చు.

వాట్సాప్

ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి రుసుము ప్రకటించలేదు. ఇది ప్రారంభ దశలోనే ఉన్నందున, దేశాన్నిబట్టి చార్జ్‌లు కూడా మారవచ్చు.

వాట్సాప్ ప్లస్ బిల్లు నెలవారీగా వేస్తారు(ఆటో-రిన్యూవల్). వాట్సాప్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న అదే తేదీన ప్రతి నెలా చార్జ్ వసూలు చేస్తారు.

సబ్‌స్క్రిప్షన్‌ను మధ్యలోనే రద్దు చేసుకున్నప్పటికీ, సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసే వరకు ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.సబ్‌స్క్రిప్షన్‌ను సరిగ్గా పునరుద్ధరించకపోతే, వాట్సాప్ ప్లస్ సర్వీసులు నిలిచిపోతాయి.

వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ తేదీకి 24 గంటల ముందు దాన్ని రద్దు చేయాలి.

వాట్సాప్
  • వాట్సాప్ ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఈ క్రింది ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని మెటా చెబుతోంది.
  • ప్రత్యేక ఎఫెక్ట్‌లతో కూడిన ప్రీమియం స్టిక్కర్‌లను పంపవచ్చు.
  • వినియోగదారులు ప్రత్యేకమైన యాప్ థీమ్‌లు, ఐకాన్‌లతో వాట్సాప్ రూపాన్ని తమకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
  • 20 చాట్‌ల వరకు పిన్ చేయవచ్చు (ప్రస్తుతం 3 చాట్‌ల వరకు మాత్రమే పిన్ చేయగలరు)
  • ముఖ్యమైన కాంటాక్ట్‌ల కోసం ప్రత్యేక రింగ్‌టోన్‌లను సెట్ చేసుకోవచ్చు (ప్రస్తుతం ఒక సాధారణ రింగ్‌టోన్‌ను మాత్రమే సెట్ చేయవచ్చు)
  • చాట్ లిస్ట్స్ కోసం ప్రత్యేక అలర్ట్, రింగ్‌టోన్, థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు.
చాటింగ్, మెసేజస్, ఫీజ్

ఫొటో సోర్స్, Getty Images

వాట్సాప్

స్టిక్కర్లు: వాట్సాప్‌లో ఇప్పటికే స్టిక్కర్లను ఎంచుకునే ఫీచర్ ఉంది. ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకమైన స్టిక్కర్లను ఎంచుకుని, యూజ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇవి వాట్సాప్ ప్లస్ లేబుల్‌తో వస్తాయి.

చాట్ పిన్: ముఖ్యమైన లేదా తరచుగా మాట్లాడే వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌లను పైభాగంలో పిన్ చేసే సౌకర్యం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ప్రతిసారీ ఈ చాట్‌ల కోసం వెతకాల్సిన అవసరాన్ని తగ్గించడానికి ఈ ఫీచర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఉచిత వెర్షన్‌లో 3 చాట్‌ల వరకు పిన్ చేయవచ్చు. వాట్సాప్ ప్లస్‌కు సబ్‌‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత 20 చాట్‌ల వరకు పిన్ చేయవచ్చు.

రింగ్‌టోన్‌లు: మొబైల్ కాల్స్ లాగానే, వాట్సాప్ కూడా ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్ కోసం ప్రత్యేకమైన రింగ్‌టోన్‌ను సెట్ చేసుకునేందుకు వీలుకల్పిస్తుంది. అయితే ఇప్పుడు అన్ని కాంటాక్ట్‌ల కోసం ఒకే రింగ్‌టోన్‌ను సెట్ చేయగలరు. కానీ, ఈ కొత్త ఫీచర్ నిర్దిష్ట కాంటాక్ట్‌ల కోసం ప్రీమియం రింగ్‌టోన్‌లను సెట్ చేసుకునేలా రూపొందింది.

చాట్ లిస్ట్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు: వాట్సాప్‌లో ఇప్పుడు స్క్రీన్ పైభాగంలో చాట్ జాబితా ఫీచర్ ఉంది. దీని అర్థం మీరు ఎంచుకున్న చాట్‌లను ఒక అంశం కింద ఉంచుకోవచ్చు. వాట్సాప్‌లో ప్రత్యేక థీమ్‌ను పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంది. వాట్సాప్ ప్లస్‌లో ప్రతి చాట్ లిస్ట్స్‌కు ప్రత్యేక అలర్ట్, థీమ్, రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)