తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు అసెంబ్లీల ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్, అసెంబ్లీ ఎన్నికలు 2026

ఫొటో సోర్స్, UGC

చదివే సమయం: 5 నిమిషాలు

ఐదు శాసన సభల ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో, సాయంత్రం 6:30 గంటల నుంచి వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి.

పీపుల్స్ ఇన్‌సైట్ పోల్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, తమిళనాడులో డీఎంకే కూటమికి 122 - 140 సీట్లు, ఏడీఎంకే కూటమికి 60 - 70 స్థానాలు, విజయ్ పార్టీ టీవీకేకి 30 - 40 సీట్లు, ఇతరులు 0 - 4 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, తమిళనాడులో డీఎంకే కూటమికి 122-132 సీట్లు, ఏడీఎంకే కూటమికి 87-100 సీట్లు, టీవీకే 10-12 సీట్లు, ఇతరులు 0 - 6 సీట్లు గెలుచుకోనున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కూటమి 125 -140 సీట్లు, బీజేపీ 146-161 సీట్లు గెలుచుకోనున్నాయని పేర్కొంది.

అస్సాంలో బీజేపీ కూటమి 85-95 సీట్లు, కాంగ్రెస్ కూటమి 25- 32 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్, అస్సాంలో ఎన్డీయే 88 - 100 సీట్లు, కాంగ్రెస్ 24 - 36 సీట్లు, ఇతరులు 0-3 సీట్లు గెలుచుకోవచ్చని పేర్కొంది.

పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌సీ(ఎన్డీయే) 16-20 సీట్లు, కాంగ్రెస్ + డీఎంకే 6-8 సీట్లు, టీవీకే 2-4 సీట్లు, ఇతరులు 1-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది.

కేరళంలో యూడీఎఫ్ కూటమి 78- 90 సీట్లు, ఎల్డీఎఫ్ కూటమి 49-62 సీట్లు, బీజేపీ+ 0-3 సీట్లు గెలుచుకోనున్నాయని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

తమిళనాడులో డీఎంకే కూటమికి ఆధిక్యం

తమిళనాడు, ఎగ్జిట్ పోల్స్, ఎన్నికలు

తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసింది. ఇక్కడ మెజారిటీకి 118 స్థానాలు అవసరం. తమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యం సాధించవచ్చని బుధవారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి.

పి-మార్క్: డీఎంకే కూటమి 125-145, అన్నాడీఎంకే కూటమి 65-85, టీవీకే 0, ఇతరులు 16-32.

మ్యాట్రిజ్: డీఎంకే కూటమి 122-132, అన్నాడీఎంకే కూటమి 87-110, టీవీకే 10-12, ఇతరులు 0-6.

పీపుల్స్ పల్స్: డీఎంకే కూటమి 125-145, అన్నాడీఎంకే కూటమి 65-80, టీవీకే 18-24, ఇతరులు 2-6.

చాణక్య స్ట్రాటజీస్: డీఎంకే కూటమి 145-160, అన్నాడీఎంకే కూటమి 50-65, టీవీకే 0, ఇతరులు 18-26.

కేరళంలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్

కేరళం, ఎగ్జిట్ పోల్స్

కేరళం అసెంబ్లీలోని 140 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీకి 71 స్థానాలు కావాలి.

యాక్సిస్ మై ఇండియా: ఎల్డీఎఫ్ 49-62, యూడీఎఫ్ 78-90, బీజేపీ కూటమి 0-3.

పి-మార్క్: ఎల్డీఎఫ్ 62-69, యూడీఎఫ్ 71-79, బీజేపీ కూటమి 1-4.

మ్యాట్రిజ్: ఎల్డీఎఫ్ 60-65, యూడీఎఫ్ 70-75, బీజేపీ కూటమి 3-5.

పీపుల్స్ పల్స్: ఎల్డీఎఫ్ 55-65, యూడీఎఫ్ 75-85, బీజేపీ కూటమి 0-3.

పుదుచ్చేరిలో..

పుదుచ్చేరి, ఎగ్జిట్ పోల్స్

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీ మార్కు 16.

యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 16-20, కాంగ్రెస్ కూటమి 6-8, ఇతరులు 3-7 స్థానాలు సాధించే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో ఎవరికి మెజారిటీ?

పశ్చిమ బెంగాల్, ఎగ్జిట్ పోల్స్

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి వెలువడిన వివిధ ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీకి 148 స్థానాలు అవసరం.

పి-మార్క్: టీఎంసీ 118-138, బీజేపీ 150-175, ఇతరులు 2-6.

మ్యాట్రిజ్: టీఎంసీ 125-140, బీజేపీ 146-161, ఇతరులు 6-10.

పీపుల్స్ పల్స్: టీఎంసీ 178-189, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, లెఫ్ట్ 0-1.

చాణక్య స్ట్రాటజీస్: టీఎంసీ 130-140, బీజేపీ 150-160, ఇతరులు 6-10.

అస్సాంలో ఆధిక్యం దిశగా బీజేపీ

అస్సాం, ఎగ్జిట్ పోల్స్

అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఇక్కడ 126 స్థానాలు ఉండగా మెజారిటీ మార్కు 64. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే ఆధిక్యం ఇస్తున్నాయి.

యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 88-100, కాంగ్రెస్ కూటమి 24-36.

జేవీసీ: బీజేపీ కూటమి 88-101, కాంగ్రెస్ కూటమి 23-33, ఇతరులు 2-5.

పి-మార్క్: బీజేపీ కూటమి 82-94, కాంగ్రెస్ కూటమి 30-40, ఇతరులు 1-5.

మ్యాట్రిజ్: బీజేపీ కూటమి 85-95, కాంగ్రెస్ కూటమి 25-32, ఇతరులు 6-12.

పీపుల్స్ పల్స్: బీజేపీ కూటమి 68-72, కాంగ్రెస్ కూటమి 22-26, ఇతరులు 11-15.

పోల్ డైరీ: బీజేపీ కూటమి 86-101, కాంగ్రెస్ కూటమి 15-26, ఇతరులు 3-7.

మే 4న ఫలితాలు..

తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి శాసన సభలకు ఏప్రిల్‌ నెలలో, మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాల మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కాబట్టి, ఇవి తుది ఫలితాలు కావని అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాజిక్ ఫిగర్ ఇదీ..

పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23 తొలి విడత జరగ్గా, నేడు రెండో విడత ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏదైనా పార్టీ లేదా కూటమికి 148 సీట్లు ఉండాలి.

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఏదైనా పార్టీ లేదా కూటమికి 118 సీట్లు అవసరం.

ఇక కేరళం విషయానికి వస్తే ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 140 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71.

అస్సాంలో ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 64 సీట్లు రావాలి.

ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు జరిగింది. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 16.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)