మాల్దీవులు: ప్రధాని మోదీపై వివాదాస్పద పోస్టులు పెట్టిన ముగ్గురు మంత్రుల సస్పెన్షన్
నరేంద్ర మోదీ లక్షదీవుల సందర్శనపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన అనంతరం భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవడంతో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
లైవ్ కవరేజీ
చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్
ఫొటో సోర్స్, ANI
నటుడు
రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.
ఫొటో సోర్స్, ANI
అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?
ఫొటో సోర్స్, Getty Images
కాల్పుల
విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో
జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు
జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
నిజానికి
వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది,
ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద
ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద
కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.
చర్చలకు
ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక
ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి
సానుకూల సంకేతాలు రాలేదు.
ఈ
నేపథ్యంలో, రెండో
విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు
తలెత్తుతున్నాయి.