ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. క్రిస్టా పైక్ : మరణ శిక్ష విఫలం.. కానీ ‘నొప్పిలేని క్షణమే లేదు’

    అమెరికా, మరణశిక్ష, విషపూరిత ఇంజెక్షన్లు
    ఫొటో క్యాప్షన్, క్రిస్టా పైక్

    సెప్టెంబర్‌లో మరణశిక్ష అమలు ప్రయత్నం విఫలమైన తర్వాత అమెరికాకు చెందిన క్రిస్టా పైక్ మొదటిసారి స్పందించారు.

    ఆమె తరఫు లాయర్ల బృందం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

    "ఆ రాత్రి జరిగిన ఘటన తర్వాత నొప్పి లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేదు. నా శరీరమంతా నొప్పిగా ఉంది. నా చేతులు, భుజాలు, గొంతు నొప్పిగా ఉన్నాయి. మాట్లాడడానికి ఇప్పటికీ ఇబ్బందిగా ఉంది. ఈ నొప్పి శారీరకమైనది మాత్రమే కాదు. మానసికమైనది కూడా " అని ఆమె చెప్పినట్టు ఈ ప్రకటనలో ఉంది.

    50 ఏళ్ల పైక్ గత నెల చివర్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    సెప్టెంబర్‌లో పెంటోబార్బిటాల్‌ను రెండు ఇంజెక్షన్లద్వారా ఎక్కించి క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ఆ ప్రక్రియ నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.

    పైక్ వయసు ఇప్పుడు 50ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో తన బాయ్‌ఫ్రెండ్‌ టడారిల్ షిప్‌తో కలిసి కొల్లీన్ స్లెమ్మర్‌ అనే యువతిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు. అప్పుడు కొల్లీన్ వయసు 19ఏళ్లు.

  2. పాకిస్తాన్: మానవ హక్కుల న్యాయవాద దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. వీళ్లు చేసిన తప్పేంటి?

  3. ‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్
    ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డేల్లో రెగ్యులర్‌గా చోటు కల్పించాలంటున్నారు యువరాజ్ సింగ్

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

    ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.

    "మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.

    ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.

  4. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు, అక్కడ వారి జీవితం ఎలా ఉంటుంది?

    ఇజ్రాయెల్ ఒక యూదు దేశం. మరి అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఎలా ఉంది?
    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఒక యూదు దేశం. మరి అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఎలా ఉంది?

    ఇజ్రాయెల్ 1948లో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పుడు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది అరబ్బులు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు.కానీ, అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. వారినే ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్బులు అని పిలుస్తున్నారు. మరింత కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  5. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు?

  6. ‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

  7. ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?

  8. అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

  9. ‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  10. తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్

    తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలో నాలుగు రోజులపాటు వానలు, వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్ ఇదే.

    ఇవాళ వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,

    రేపు(31 అక్టోబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి,

    ఎల్లుండి(1 నవంబర్ 2026)వర్షం కురిసే జిల్లాలు: తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

    సోమవారం(2 నవంబర్ 2026 )వర్షం కురిసే జిల్లాలు: కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో వానలు పడతాయని మిగతా జిల్లాల్లో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  11. ‘నేను కుప్పకూలే వరకు నాలో ఆ లోపం ఉందనే విషయం తెలియదు’

  12. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నేషనల్ హైవేపై వరద నీరు.. ఇచ్ఛాపురానికి రెండు వైపులా రాకపోకలకు అంతరాయం

    శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు
    ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి- ఇచ్చాపురంలో మొదటి అంతస్తుకు చేరిన నీరు

    అర్నబ్ తుపాను తీరం దాటిన తరువాత కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    దీంతో శ్రీకాకుళంలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉప్పొంగాయి.

    ముఖ్యంగా మహేంద్ర తనయ, బాహుదా నదులకు ఎగువన ఒడిశా నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో దిగువ ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

    ఒడిశా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పట్టణం ఇచ్ఛాపురంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

    ఇక్కడి బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి. జాతీయ రహదారికి వెళ్లే మార్గం కూడా వరద నీటిలో మునిగిపోయింది.

    పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే.. సుమారు పది ఇళ్లు మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితులు ఇళ్ల పైఅంతస్తులు, డాబాలపైకి చేరుకున్నారు.

    వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    మరోవైపు, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. పలు చోట్ల వరద నీట్లో వాహనాలు చిక్కుకుపోయాయి.

    రైలు మార్గంలోనూ కొంతమేర పట్టాలు వరద నీట్లో మునిగిపోయాయి.

    వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఫొటో క్యాప్షన్, వరద నీరు ఉప్పొంగడంతో బెల్లుపడలోని పలు ఇళ్లు నీట మునిగాయి
    ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఫొటో క్యాప్షన్, ఇచ్చాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై కూడా వరద తీవ్రత కనిపిస్తోంది. వరద నీటిలో రెండు లారీలు చిక్కుకుపోయాయి.
    ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
    ఫొటో క్యాప్షన్, ఒడిశాలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి.
  13. చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్‌ పూర్తి చేసిన కశ్మీరీ మహిళ.. ‘సైనికుడి భార్య జీవితం పోరాటమే’ అని ఆమె ఎందుకన్నారు

  14. అంతర్వేదీ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్

    అర్నబ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న వేళ అంతర్వేది తీరానికి ఒక భారీ షిప్ రావడం చర్చనీయాంశంగా మారింది.

    సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఓడ వచ్చిందని కోస్టుగార్డు అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ షిప్, తుపాను ధాటికి ఇలా తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు.

    ఇందులో ఉన్న సిబ్బందిని కోస్ట్‌గార్డ్ దళాలు కాపాడాయి.

  15. ‘ప్రతి పెట్టుబడికి నాదీ భరోసా’ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ‌ రైజింగ్‌లో భాగ‌స్వాములు కావాల‌ని అంత‌ర్జాతీయ‌ పారిశ్రామిక‌వేత్త‌లను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

    హైద‌రాబాద్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాన్ని దిల్లీలో నిర్వ‌హించారు.

    కార్య‌క్ర‌మానికి కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రిరేవంత్ రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి అవ‌స‌ర‌మైన విధాన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంత‌ర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

    పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చెప్పాలని, విధానపరమైన మార్పుల నుంచి అవసరమైన సహకారం వరకు అన్నింటినీ అందించేందుకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

    "2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు భారతీయులందరూ కలిసి కృషి చేయాలి. ప్రస్తుతం మనం దసరా, కర్వా చౌత్, దీపావళి వంటి పండుగల సీజన్‌లో ఉన్నాం. ఈ సమ్మిట్ మనకు మరో పండుగ వంటిది. 700 ఏళ్లకు పైగా క్రితమే, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సముద్ర వాణిజ్యానికి సంబంధించి 'మోటుపల్లి శాసనం'ను జారీ చేశారు" అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

    ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
    ఫొటో క్యాప్షన్, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ -2026 క‌ర్టెన్‌ రైజ‌ర్ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హామీ
  16. వందేళ్లపైబడిన చెట్లు కూడా కూలిపోయాయి

    వీడియో క్యాప్షన్, వందేళ్ల పైబడి వయసున్న చెట్లు అర్నబ్ తుపాను తీవ్రతకు కూలిపోాయాయి.

    అర్నబ్ తుపాను నర్సాపురం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది.

    చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు చదువుకున్న పట్టణంలోని వైఎన్ కాలేజీ తుపాను వల్ల తీవ్రంగా నష్టోయింది.

    వందేళ్లపైబడిన చెట్లు కూడా తుఫాన్ తీవ్రతకు కూకటివేళ్లతో సహా పడిపోయాయి.

  17. అమెరికా నుంచి గ్యాస్ కొనుక్కోవాల్సిన స్థితిలో ఖతార్

    ఖతార్, ఇరాన్, అమెరికా, గ్యాస్
    ఫొటో క్యాప్షన్, హార్ముజ్ జలసంధి(ఫైల్ ఫోటో)

    ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసుకునేందుకు కీలక ఒప్పందం చేసుకుంది.

    ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది.

    దీంతో అమెరికా నుంచి గ్యాస్‌ దిగుమతి చేసుకునేలా 20 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.

    అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న ఒక ప్లాంట్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నుల గ్యాస్‌ దిగుమతికి ఖతార్ ఎనర్జీ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది.

    ఈ ఒప్పందం ప్రకారం 2030 నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభమవుతుంది.

    ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా ఉండడం చూస్తే హార్ముజ్ జలసంధి విషయంలో కొనసాగుతున్న సంక్షోభం త్వరలో ముగిసే అవకాశం లేదని ఖతార్ భావిస్తున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

  18. లాఠీలకు భయపడకండి, మార్చ్‌కు తరలిరండి : రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఛలో దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పోలీసులకు, లాఠీలకు భయపడొద్దని రాహుల్ గాంధీ చెప్పారు.

    ఇండియా కూటమి నిర్వహించే ‘ఛలో దిల్లీ’ మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.

    పోలీసులకు, వారి లాఠీలకు భయపడొద్దని ‘ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.

    ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు.

    "నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌ల మీద విసిగిపోయినవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేవారంతా ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    రాహుల్ గాంధీ పోస్టును కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ట్యాగ్ చేశారు.

    ‘‘తెలంగాణకు రైళ్లు ఇవ్వడం నిరాకరించడం నుంచి దిల్లీ వ్యాపారులను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడంవరకు నవంబర్ ఒకటిన జరిగే మార్చ్‌ను భగ్నం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు" అని పవన్ ఖేరా రాశారు.

    .

  19. ఏమిటీ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి, లక్షణాలేమిటి?

    డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలలో పాదాల తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట ఉంటుంది.
    ఫొటో క్యాప్షన్, డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలలో పాదాల తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట ఉంటుంది.

    మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ నరాల సమస్యలు రావు. అయితే వ్యాధి వ్యవధి పెరిగేకొద్దీ, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోతే, ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినే అవకాశం పెరుగుతుంది.

    అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) 2026 మార్గదర్శకాల ప్రకారం, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవారిలో దాదాపు 50 శాతం మందికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. మరింత కథనం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

  20. పాదాలలో తిమ్మిరి, సూదులతో గుచ్చినట్టు మంట.. ఇవి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి లక్షణాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?