చైనా చేరుకున్న ట్రంప్, ఘనస్వాగతం పలికిన షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమానాశ్రయానికి వెళ్లి ట్రంప్‌కు స్వాగతం పలకడం కేవలం మర్యాదపూర్వక కార్యక్రమమే కాదు. దీని వెనుక ఎంతో ఆలోచించి రూపొందించిన దౌత్య వ్యూహం ఉంది.
ఇలాంటి స్వాగతానికి ఉన్న ప్రాధాన్యాన్ని షీ జిన్‌పింగ్ అర్థం చేసుకున్నారు.
షీ జిన్‌పింగ్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒక విదేశీ అధ్యక్షుడికి స్వాగతం పలికినట్లు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో చేసిన పనినే షీ జిన్‌పింగ్ ఇప్పుడు చేస్తున్నారు.
ఈ ఏడాది అమెరికాలో షీ జిన్‌పింగ్‌కు స్వాగతం పలికేందుకు ట్రంప్ స్వయంగా వాషింగ్టన్ విమానాశ్రయానికి వెళ్లారు. ఇప్పుడు చైనా అధ్యక్షుడు కూడా ట్రంప్‌కు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు.
అయితే వ్యక్తిగత గౌరవం, మర్యాద, హోదాకు ట్రంప్ ఎంతో ప్రాధాన్యం ఇస్తారని షీ జిన్‌పింగ్‌కు తెలుసు.
ఈ బాధ్యతను మరొకరికి అప్పగించకుండా స్వయంగా స్వాగతం పలకడం ద్వారా ట్రంప్‌కు ప్రత్యేక గౌరవం ఇచ్చారు జిన్ పింగ్. ఆయన స్వయంగా వెళ్లి స్వాగతించడం ద్వారా ట్రంప్ తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని తెలియజేస్తున్నారు.
వాణిజ్యం, తైవాన్, సాంకేతికత వంటి అంశాలపై జరగనున్న చర్చలు ఈ సానుకూల సంకేతంతో సులభతరం అవుతాయని షీ జిన్‌పింగ్ ఆశించవచ్చు.
తన ప్రతిష్ఠకు ఎలాంటి నష్టం కలగకుండా జిన్ పింగ్ ఈ పని చేయగలరు. ఎందుకంటే ట్రంప్, షీ జిన్‌పింగ్, పుతిన్ మధ్య జరగనున్న ఈ అసాధారణ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన మొత్తం ప్రణాళిక, ఏర్పాట్లు ఇప్పటికే చైనా నియంత్రణలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images








