క్రిస్టా పైక్ : మరణ శిక్ష విఫలం.. కానీ ‘నొప్పిలేని క్షణమే లేదు’

ఫొటో సోర్స్, Reuters
సెప్టెంబర్‌లో మరణశిక్ష అమలు ప్రయత్నం విఫలమైన తర్వాత అమెరికాకు చెందిన క్రిస్టా పైక్ మొదటిసారి స్పందించారు.
ఆమె తరఫు లాయర్ల బృందం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.
"ఆ రాత్రి జరిగిన ఘటన తర్వాత నొప్పి లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేదు. నా శరీరమంతా నొప్పిగా ఉంది. నా చేతులు, భుజాలు, గొంతు నొప్పిగా ఉన్నాయి. మాట్లాడడానికి ఇప్పటికీ ఇబ్బందిగా ఉంది. ఈ నొప్పి శారీరకమైనది మాత్రమే కాదు. మానసికమైనది కూడా " అని ఆమె చెప్పినట్టు ఈ ప్రకటనలో ఉంది.
50 ఏళ్ల పైక్ గత నెల చివర్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సెప్టెంబర్‌లో పెంటోబార్బిటాల్‌ను రెండు ఇంజెక్షన్లద్వారా ఎక్కించి క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమయింది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ఆ ప్రక్రియ నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
పైక్ వయసు ఇప్పుడు 50ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో తన బాయ్‌ఫ్రెండ్ టడారిల్ షిప్‌తో కలిసి కొల్లీన్ స్లెమ్మర్ అనే యువతిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు. అప్పుడు కొల్లీన్ వయసు 19ఏళ్లు.










