అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  2. రష్యా నుంచి చమురు దిగుమతికి ట్రంప్ నిర్ణయం: అమెరికన్ల ఆశ్చర్యం, జెలియెన్‌స్కీ ఆగ్రహం

  3. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  4. "రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?

  5. రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

    డోనల్డ్ ట్రంప్, అమెరికా, రష్యా, డీజిల్
    ఫొటో క్యాప్షన్, అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని ట్రంప్ అన్నారు.

    ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్‌ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.

    అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.

    శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.

    ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.

    యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  6. జంతర్‌ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు

  7. ఈయనకు లైవ్‌లో మరణ శిక్ష అమలు చేస్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు

  8. గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’

  9. ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?

  10. బంగారు ఇటుకలు, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు: ఓ గూఢచారి ఘరానా మోసం..

  11. ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

    జేడీ వాన్స్, అమెరికా, ఇండియా, మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని
    ఫొటో క్యాప్షన్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపును సమర్థించిన జేడీ వాన్స్

    గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.

    కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."

    మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.

  12. స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    అమెరికా, భారత్, స్మిత్ మచ్చర్, ఇజ్రాయెల్,
    ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు (ఫైల్ ఫోటో)

    ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.

    భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.

    "ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

    భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.

  13. వీసా మోసాలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా పలు భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లకు మినహాయింపు

    ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని, అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్
    ఫొటో క్యాప్షన్, అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ప్రకారం, శాశ్వత వీసా కార్యక్రమం నుంచి కంపెనీలను నిలిపివేయడం అనేది అమెరికన్లకు ఒక పెద్ద విజయం

    ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని సహా పలు ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలను యూఎస్ కార్మిక శాఖ యూఎస్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.

    అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఈ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా తొలగించామని చెప్పారు. ఈ రెండు కంపెనీలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.

    "ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినిలను పర్మినెంట్ వర్కర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పలు ఫెడరల్ దర్యాప్తుల కారణంగా యూఎస్ కార్మిక శాఖ కూడా మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది" అని సోండర్లింగ్ అన్నారు.

    ఆయన ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రస్తావించారు.

    బహుశా మైక్రోసాఫ్ట్ కంటే మరే ఇతర అమెరికన్ కంపెనీ కూడా ఈ వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసి ఉండదని సోండర్లింగ్ ఆరోపించారు.

    2025లో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని సోండర్లింగ్ ఆరోపించారు.

    కొన్ని పదవులకు అర్హతగల అమెరికన్ ఉద్యోగులను కనుగొనలేకపోతున్నామని ఆ సంస్థ ఇంతకుముందు చెప్పింది.

    "వీసా ప్రక్రియ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులను పరిరక్షించడానికి, ఈ రోజు తీసుకుంటున్న ఈ చరిత్రాత్మక చర్య ఒక ముఖ్యమైన మొదటి అడుగు" అని సోండర్లింగ్ X లోని ఒక పోస్ట్‌లో రాశారు.

  14. బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది, బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు

    క్రమటోర్స్క్‌, రష్యా, యుక్రెయిన్
    ఫొటో క్యాప్షన్, బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది

    "బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా జరిపిన దాడుల్లో" కనీసం 30 మంది మరణించారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

    సరిహద్దు నగరమైన క్రమటోర్స్క్‌లో పౌరులతో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై రష్యా గ్లైడ్ బాంబులు దాడి చేశాయని అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంత అధిపతి వాడిమ్ ఫిల్యాష్కిన్ తెలిపారు.

    సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులను చంపేందుకు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

    స్థానిక అధికారులు పోస్ట్ చేసిన చిత్రాలలో రోడ్డుపై శిథిలాలు, మండుతున్న బస్సు కనిపించాయి.

    రష్యా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న కోట ప్రాంతంలో క్రామటోర్స్క్, దాని పొరుగు నగరమైన స్లోవియాన్స్క్ ఉన్నాయి. యుక్రెయిన్లోని డాన్‌బాస్ పారిశ్రామిక ప్రాంతం మొత్తం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాదిస్తున్నారు.

    దేశవ్యాప్తంగా రష్యా దాడులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా దాడిపై రష్యా ఇంకా స్పందించలేదు.

    ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి యుక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య, 2025 సంవత్సరం మొత్తం మీద మరణించిన పౌరుల సంఖ్యను మించిపోయింది.

  15. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  16. రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?

  17. భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?

  18. పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?

  19. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    చలో లోక్ భవన్
    ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  20. జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..