యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  2. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  3. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
    ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  4. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  5. '2022లో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా’ : సౌదీ కఠిన చట్టాలు తెలుసుకోకపోతే ప్రమాదమే

  6. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  7. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  8. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  9. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  10. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  11. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  12. అహ్మదాబాద్: అక్కడ పురుషులు మహిళల్లా వస్త్రాలు ధరించి గర్బా ఎందుకు ఆడతారు, దీనివెనకున్న కథేంటి?

  13. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  14. పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ

    ఫ్రాన్స్, పారిస్,
    ఫొటో క్యాప్షన్, అల్లర్లు చెలరేగిన పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

    ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగిన పారిస్‌తోపాటు పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.

    దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో జరిగిన అల్లర్లు, దోపిడీల కారణంగా ఫ్రాన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. పారిస్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఇతర నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

    వారాంతంలో నిరసనకారులు గుమిగూడిన ప్లేస్ డి లా రిపబ్లిక్, లెస్ హాల్స్ షాపింగ్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పారిస్ పోలీసులు తెలిపారు.

    ప్రజలు అనధికారిక సమావేశాలపై నిషేధం విధించారు. దక్షిణాన ఉన్న మార్సెయిల్, బోర్డో, నైస్, లియోన్ నగరాలతోపాటు ఉత్తరాన ఉన్న లిల్లే, ఇతర పట్టణాల్లో యువత కదలికలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ పాక్షిక కర్ఫ్యూలను ప్రకటించారు.

  15. ఫ్రాన్స్ నిరసనలు: పారిస్‌లో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోయింది

    ఫ్రాన్స్, నిరసన, స్కూల్
    ఫొటో క్యాప్షన్, నిరసనల వల్ల ఫ్రాన్స్ గురించి తన అభిప్రాయం మారిందని ఎలిజా చెప్పారు.

    ఎలిజా లుమాని హనీమూన్ కోసం ఈ వారాంతంలో పారిస్ వచ్చారు. పారిస్‌కు వెళ్లడం ఆమె చిరకాల స్వప్నం.

    అయితే ఫ్రాన్స్‌లో నిరసనలు జరుగుతాయని తనకు అస్సలు తెలియదని ఆమె చెప్పారు.

    పారిస్‌లో తిరుగుతున్నప్పుడు తొలుత ప్రశాంతంగా నిరసనలు చేస్తున్నవాళ్లను చూశానని, వాళ్లలో కొందరు మెరుగైన పాఠశాలు, జీవన పరిస్థితుల కోసం ఆందోళనలు చేస్తున్నామని చెప్పారని స్వీడన్‌కు చెందిన 28ఏళ్ల ఎలిజా చెప్పారు.

    తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

    ఎక్కడికక్కడ మంటలు చెలరేగాయని, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని, టియర్ గ్యాస్ క్యానిస్టర్ల నుంచి వచ్చిన పెద్ద శబ్దాలు తనను మరింత భయపెట్టాయని ఎలిజా అన్నారు.

    ‘‘నాకు నిరసనకారులను చూస్తే భయమేయలేదు. వాళ్లు ఎవరిపైనైనా దాడి చేయడానికి వచ్చినట్టు అనిపించలేదు. టియర్ గ్యాస్ వల్లే భయమేసింది. దాని వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది’’ అని ఎలీజా ఫ్రాన్స్‌లో పరిస్థితిని వివరించారు.

    ఫ్రాన్స్, నిరసన, స్కూల్
    ఫొటో క్యాప్షన్, హోటల్‌కు పారిస్‌కు మరోవైపు ఉండడంతో వీధుల గుండా నడిచి వెళ్లాల్సివచ్చిందని ఎలిజా చెప్పారు.

    ఈ నిరసనలను ప్రత్యక్షంగా చూడడం వల్ల ఫ్రాన్స్‌పై తన అభిప్రాయం మారిందని ఆమె అన్నారు.

    ‘‘అందమైన ప్రేమికులకు అనువైన రొమాంటిక్ నగరంగానే పారిస్‌ను చూశా. కానీ వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా యువతరం తాము నమ్మిన విషయాల కోసం నిలబడడం చూశాక పారిస్‌లో మరోకోణం ఉందని అర్ధమైంది’’ అని ఎలిజా అన్నారు.

  16. బంగ్లాదేశ్‌కు చెప్పకుండానే ఆ దేశ జంటకు సౌదీ మరణ శిక్ష అమలు చేసిందా?

  17. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  18. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  19. ఇరాన్ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ

    ఇరాన్, రక్షణ మంత్రి, మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ
    ఫొటో క్యాప్షన్, తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఇరాన్ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ

    ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఖీ కెతాబ్చీ నియమితులైనట్టు బీబీసీ పర్షియన్ తెలిపింది. పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో 237 ఓట్లు పొంది రక్షణ మంత్రిగా నియమితులయ్యారు.ఇటీవa యుద్ధంలో మరణించిన అజీజ్ నాసిర్‌జాదే స్థానంలో ఆయన నియామకం జరిగింది.

    ఇరాన్ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అఖ్లాఖీకి నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉందని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పార్లమెంటుకు తెలిపారు. ఇరాన్ క్షిపణి, రక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకున్న అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, సైనిక అధికారులతో అఖ్లాఖీ కలిసి పనిచేశారని పేర్కొన్నారు.

    ఇటీవలి యుద్ధం తర్వాత ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుందని, ఇది ప్రత్యర్థుల సైనిక అంచనాలు మారాయని పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంలో అఖ్లాఖీ అన్నారు.

    క్షిపణి సామర్థ్యాల అభివృద్ధికి, ముఖ్యంగా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ నియామకం కీలకంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

  20. శాంతించండి: ప్రజలకు ఫ్రాన్స్ అధ్యక్షుడి పిలుపు

    ఫ్రాన్స్, పారిస్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లపై స్పందించిన అధ్యక్షుడు

    ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, దోపిడీలు దాడులకు దారితీయడంతో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు.

    ఎల్సీ పాలెస్‌నుంచి జాతినుద్దేశంచి ప్రసంగించిన ఆయన "పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవద్దని" హెచ్చరించారు.

    నిరసనకారుల "న్యాయబద్ధమైన డిమాండ్లకు" "విధ్వంసం, లూటీ చేసే వారికి" మధ్య తేడాను గుర్తించాలని మేక్రాన్ సూచించారు. హింసను ఎవరూ, ఎప్పుడూ సమర్థించబోరని దీనికి ఖచ్చితంగా శిక్షలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

    పెరుగుతున్న ఇంధన ధరలు, జీవన వ్యయం సహా ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదని సుమారు 5,50,000 మంది ప్రదర్శనకారులు చాలావరకు శాంతియుతంగా వీధుల్లోకి వచ్చారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పోలీసులు సుమారు 2,400 మందిని అరెస్టు చేశారు.

    పారిస్, మార్సెయిల్, ఇతర పట్టణాలు, నగరాల్లో కూడా అల్లరిమూకలు బయటకు వచ్చాయి. వారిలో కొందరు నల్లటి దుస్తులు ధరించి, ముసుగులు ధరించి కార్లకు, భవనాలకు నిప్పు పెట్టారు.