పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన అక్వాన్ రేపు(నవంబర్ 19)సాయంత్రానికి సమయానికి అతి తీవ్రతుపానుగా బలపడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
సారాంశం
అక్వాన్ తుపాను అతి తీవ్ర తుపాన్‌గా మారి ఆంధ్రప్రశ్‌లో తీరం దాటనుందని వాతావరణశాఖ తెలిపింది.
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చారిత్రక సమావేశం రేపు(నవంబర్ 19)జరగనుంది.
రష్యాలోని సైబీరియాలో సైనిక కార్గో విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 19 మంది మరణించారు.
లైవ్ కవరేజీ
అక్వాన్ తీవ్ర తుపాన్ మచిలీపట్నం- పూరీ మధ్య తీరం దాటే అవకాశం
అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఎల్లుండి(నవంబర్ 20) మధ్యాహ్నానికి మచిలీపట్నం- పూరీ మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజిఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అక్వాన్ తీవ్ర తుపాన్ మచిలీపట్నం- పూరీ మధ్య తీరం దాటే అవకాశం
కుల్గాం ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం: పోలీసులు
ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, జమ్మూకశ్మీర్‌లో ఒక ఉగ్రవాది మృతి
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని భద్రతా దళాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి కశ్మీర్ జోన్ పోలీసులు ఒక మృతదేహాన్ని, ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. మృతుణ్ని లష్కర్-ఏ-తోయిబా అగ్రశ్రేణి ఉగ్రవాది లతీఫ్ భట్‌గా పేర్కొంది.
"ఒక ఉగ్రవాది మసీదులో తలదాచుకున్నాడు. భద్రతా దళాలు అత్యంత సంయమనం పాటిస్తూ, ఆ పుణ్యక్షేత్రం పవిత్రతను గౌరవిస్తూ, ఆ ఉగ్రవాదిని మసీదు ప్రాంగణం నుంచి తరిమికొట్టాయి. ఆ తర్వాత అతను హతమయ్యాడు" అని భారత్ ఆర్మీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని తెలిపింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని కుల్గాం ఎస్‌ఎస్‌పి అనాయత్ అలీ తెలిపారు.
లతీఫ్ అనే స్థానిక ఉగ్రవాది అక్కడ ఉన్నాడని, లొంగిపోవడానికి నిరాకరించి, ఒక మసీదులోకి వెళ్లాడని, అర్ధరాత్రి సుమారు 2:45 గంటలకు కాల్పులు ప్రారంభించాడని అనాయత్ అలీ వెల్లడించారు. లతీఫ్ 2025 నవంబర్ 18న లష్కర్-ఏ-తోయిబాలో చేరాడని తెలిపారు.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, జమ్మూకశ్మీర్‌లో ఒక ఉగ్రవాది మృతి
యూపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత అఖిలేష్ యాదవ్ ఏమన్నారు?
ఫొటో సోర్స్, Deepak Gupta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, బీజేపీ ఓట్ల అవకతవకలకు పాల్పడిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు
ఉత్తరప్రదేశ్‌లో
స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2027 కింద ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
2026
ఏప్రిల్ 10 నుంచి 2026 నవంబర్ 17 మధ్య కాలంలో రాష్ట్రంలో మొత్తం 18 లక్షల 84 వేల
113 మంది ఓటర్లు పెరిగారని ఉత్తరప్రదేశ్ నవ్‌దీప్ రిన్వా చెప్పారు.
కొత్త
పేర్లను చేర్చడం, పాత పేర్లను తొలగించడం చేపట్టిన తర్వాత.. రెండింటిన్నీ
పరిగణనలోకి తీసుకున్నాక ఈ పెరుగుదల కనిపించిందని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్ల
జాబితాలో పేర్లను కేవలం సవరణ ప్రక్రియ సమయంలోనే చేర్చవచ్చని లేదా తొలగించవచ్చని
భావించడం తప్పని ఆయన అన్నారు.
ఓటర్ల
జాబితాను ఏడాదంతా నవీకరించవచ్చని రిన్వా అన్నారు. తుది జాబితా విడుదల చేసిన తర్వాత
రోజు నుంచి ప్రజలు ఫామ్ 6, 7, 8లను సమర్పించవచ్చన్నారు.
ప్రస్తుత
స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో అర్హులైన కొత్త యువ ఓటర్లను చేరుస్తున్నట్లు ఆయన
చెప్పారు.
ఉత్తరప్రదేశ్
ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన విలేకరుల సమావేశం తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. 'ఫామ్ 6'లో ఏవైనా అక్రమాలు జరిగితే, ప్రజలు బీజేపీకి, అవినీతిపరులైన
అధికారులకు ‘ఛఠీ కా దూద్’’ (తగిన గుణపాఠం) గుర్తు చేస్తారని పేర్కొన్నారు.
‘‘అవినీతిపరులైన అధికారులకు తదుపరి గమ్యస్థానం జైలే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో తమ ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ,
దాని కుట్రపూరిత మిత్రపక్షాలు ప్రత్యేక నిఘా కార్యక్రమం పేరుతో ఏఎస్‌డీడీ (అంటే గైర్హాజరైనవారు, బదిలీ అయినవారు, మరణించినవారు లేదా నకిలీ/ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన ఓటర్లు) పేరుతో నకిలీ ఓట్లను చేర్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి. అధికారులపై
ఒత్తిడి తెచ్చి పేర్లను చేర్చే అక్రమ చర్యకు వ్యతిరేకంగా ప్రతి సాక్ష్యాధారాన్ని
సేకరిస్తాం, అలాగే
ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తాం.
విచారణ
పూర్తయ్యాక, చట్టం వారి
అక్రమ సంపాదనను జప్తు చేస్తుంది. ఇది స్పష్టమైన హెచ్చరిక: ఏ
అవినీతిపరుడినీ వదిలిపెట్టబోం, ఎట్టి
పరిస్థితుల్లోనూ ఎవరూ తప్పించుకోలేరు’’ అని ట్వీట్ చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: తీరప్రాంత ప్రజలకు అధికారుల సూచన
ఫొటో క్యాప్షన్, అక్వాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన అక్వాన్ నెమ్మదిగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది.
ఎల్లుండి మధ్యాహ్నానికి నెల్లూరు- విశాఖ మధ్య తీవ్ర తుపాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాన్ గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి ఆర్టీజిఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ తగిన సూచనలు చేస్తోందని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ చెప్పారు.
తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
తొలిసారి సమావేశం కానున్న ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, జిన్‌పింగ్, ట్రంప్, పుతిన్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చారిత్రక సమావేశం రేపు(గురువారం, నవంబర్ 19)జరగనుంది. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరగనుంది.
సమావేశంపై వైట్ హౌస్, క్రెమ్లిన్ ప్రకటనల తర్వాత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలకు చెందిన ఈ ముగ్గురు నాయకులు ఒకే వేదికపై కలుసుకోవడం ఇదే తొలిసారి. రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాన్ని పుతిన్ ప్రతిపాదించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అణ్వాయుధ నిరాయుధీకరణపై త్రైపాక్షిక చర్చలను తాను స్వాగతిస్తానని అక్టోబర్‌లో ట్రంప్ చెప్పారు. ఈ ముగ్గురు నేతలు అనేక అంశాలపై చర్చిస్తారని ఈ నెల ప్రారంభంలో కూడా ఆయన అన్నారు.
ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశం అజెండాపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి అదనపు వివరాలు వెల్లడించలేదు.
రష్యాలో కూలిపోయిన సైనిక కార్గో విమానం, 19 మంది మృతి
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, రష్యాలో సైనిక కార్గో విమాన ప్రమాదంలో 19 మంది చనిపోయారు.
రష్యాలోని సైబీరియాలో సైనిక కార్గో విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 19 మంది మరణించారని రక్షణ మంత్రిత్వ శాఖ పేరుతో రష్యా ప్రభుత్వ మీడియా రిపోర్ట్ చేసింది.
మంగళవారం కెమెరోవో ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఏఎన్-12 విమానం కూలిపోయిందని తెలిపింది.
ప్రమాదంపై రష్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
యాగునోవో గ్రామం సమీపంలో విమానం కూలిపోయిందని స్థానిక గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ తెలిపారు. అత్యవసర బృందాలు ఘటనా స్థలంలో మంటలను త్వరగా ఆర్పివేశాయి.
ఒక హెలికాప్టర్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని ఘటనా స్థలాన్ని సందర్శించిన సెరెడ్యుక్ చెప్పారు. ఇప్పుడు దర్యాప్తు అధికారులకు సహకరించడమే ప్రధాన కర్తవ్యం అని ఆయన అన్నారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియోలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో షేర్ అయిన సీసీటీవీ ఫుటేజ్‌లో దూరంగా ఆకాశం నుంచి ఒక వస్తువు కింద పడడం కనిపించింది. ఆ ఫుటేజ్ తేదీ, సమయాన్ని బీబీసీ, రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించాయి. చుట్టుపక్కల చిత్రాలను ఉపగ్రహ చిత్రాలతో పోల్చి ఆ ప్రదేశాన్ని కూడా రాయిటర్స్ నిర్ధరించింది. విమానంలో ఉన్న సరుకు ఏంటనేదానిపై స్పష్టత లేదు.
ఆయుధాలు, సిబ్బంది రవాణాకు, గాలింపు, సహాయక చర్యల కోసం రష్యా సైన్యం ఏఎన్-12విమానాలను ఉపయోగిస్తుంది.
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్
ఫొటో సోర్స్, IMD
ఫొటో క్యాప్షన్, వాతావరణ శాఖ
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది.
ప్రస్తుతానికి ఈ తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ వివరించింది.
తుపాను నెమ్మదిగా ఉత్తర వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని ఈ తెల్లవారుజామున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగానే కదులుతూ రేపు సాయంత్రం(నవంబర్ 19)5.30 గంటల సమయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని తెలిపింది.
నవంబర్ 20న మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, విశాఖపట్టణం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఆ సమయంలో గంటకు 120 నుంచి 130కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, గాలుల తీవ్రత 145కిలోమీటర్ల వరకు పెరగొచ్చని అంచనావేసింది.
తుపాను ప్రబావంతో రేపు, ఎల్లుండి(నవంబర్ 19,20) కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
నవంబర్ 20,21 తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.
ఇప్పటి నుంచి మధ్యాహ్నం 3.00గంటలవరకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.