గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
ఈ పర్యటనలో రూబియోతో పాటు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. ఆయన ఈ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, అందులో వారితో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఉన్నారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, X/USAmbIndia
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో బుధవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీని సందర్శించారు.
ఈ పర్యటనలో రూబియోతో పాటు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నారు. ఆయన ఈ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, అందులో వారితో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఉన్నారు.
గోర్ ఆ పోస్ట్‌లో.. "మార్కో రూబియోతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీని సందర్శించే గౌరవం నాకు లభించింది. గత ఏడాది కాలంలో అమెరికా నుంచి భారతదేశం చేసే ఎల్పిజి దిగుమతుల వాటా 10 శాతం కంటే తక్కువ నుంచి 67 శాతానికి గణనీయంగా పెరిగింది" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో బుధవారం గ్రాప్-1(జీఆర్ఏపీ-1) అమల్లోకి తీసుకొచ్చారు.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను సంక్షిప్తంగా గ్రాప్ అని పిలుస్తారు.
‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ కేపిటల్ రీజియన్ అండ్ అడ్జోయినింగ్ ఏరియాస్’(సీఏక్యూఎం) జారీ చేసిన ఆదేశాలప్రకారం... అక్టోబర్ 20న దిల్లీలో వాయు నాణ్యత సూచిక(ఏక్యూఐ) 179గా ఉంది. ఇది మోడరేట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే, అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు అది 244కి పెరిగింది. ఏక్యూఐ 244 అనేది పూర్ కేటగిరీలోకి వస్తుంది.. దీంతో గ్రాప్-1 నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.
ఏక్యూఐ 201 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత పూర్ కేటగిరీలోనే కొనసాగవచ్చని కమిషన్ కూడా పేర్కొంది.
గ్రాప్ – 1 అమల్లో ఉన్నప్పుడు ఇవి నిషేధం
గ్రాప్-1 అనేది వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించడానికి అమలుచేసే నివారణ చర్యలు. వాహన, పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించడం, దుమ్ముధూళిని నియంత్రించడం వంటివి ఈ చర్యల ప్రధాన లక్ష్యం.

ఫొటో సోర్స్, Toru Hanai/Getty Images
జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో 2026లో భారత్ మూడో రోజు అద్భుతమైన ఆటతో మూడు స్వర్ణాలను గెలుచుకుంది.
ఆయుష్ వర్మ, ప్రవీణ్ కుమార్, సచిన్ ఖిలారీ తమతమ విభాగాల్లో మూడు స్వర్ణాలను సాధించి దేశానికి కీర్తి తీసుకొచ్చారు.
పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 53 విభాగంలో ఆయుష్ వర్మ మూడో రోజులో మొదటి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. పురుషుల హైజంప్ టీ 64 విభాగంలో ప్రవీణ్ కుమార్ రెండో బంగారు పతకం సాధించాడు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్ 46 విభాగంలో సచిన్ ఖిలారీ మరో స్వర్ణం భారత్ ఖాతలో వేశాడు.
మొత్తంగా మూడో రోజు భారత్ అథ్లెట్స్ మూడు స్వర్ణ, ఆరు రజత, 3 కాంస్యాలతో మొత్తం 12 పతకాలు గెలుచుకున్నారు.
మూడో రోజు సాధించిన పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 47కు చేరింది. ఇందులో 12 బంగారు, 17 రజత, 18 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, uspis.gov
నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.
ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.
యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్బ్యాంక్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.
ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో జరిగిన ఓ ప్రదర్శనలో రేగిన వివాదానికి సంబంధించి పంజాబ్ గాయకుడు దలేర్ మెహిందీకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాపర్ బాద్షా అండగా నిలిచారు.
ఈ ప్రదర్శన జరుగుతుండగా ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైకి వచ్చి తాగి పాడుతున్నావంటూ దలేర్ మెహిందీ పాటను ఆపేశారు. ఈక్రమంలో దలేర్ మెహిందీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అలాగే సినీ పరిశ్రమ కూడా బాసటగా నిలవాలని కోరారు.
‘‘నేను ఈ మధ్య ఓ వీడియో చూశాను. అందులో దలేర్ మెహిందీజీ వేదికపై పాడుతుండగా, ఎవరో మంత్రి వేదికపైకి వచ్చి ఆయన గురించి కోపంగా మాట్లాడుతూ ఏదేదో చెప్పారు. నేను అక్కడ లేను. అందుకే దీని గురించి నాకు పెద్దగా సమాచారం లేదు. కానీ దలేర్ జీ గత పాతిక ముప్పై సంవత్సరాలుగా తెలుసు. ఆయన మద్యం సేవించరు. నేను కలిసిన మంచి మనుషులలో ఆయన ఒకరు’’ అని అనుపమ్ ఖేర్ చెప్పారు.
‘దలేర్జీ ఆరోగ్యం గత రెండుమూడేళ్లుగా సరిగా లేదు. అయినా ఆ సంస్థతో ఏదైనా కమిట్మెంట్ ఉండటం వల్ల ఆయనీ కార్యక్రమాన్ని తిరస్కరించలేకపోయి ఉండొచ్చు. బహుశా ఆయన కేవలం పెదాలు మాత్రమే కదిపి ఉండొచ్చు. కానీ జరిగినదానిపై చాలా బాధపడ్డా. ఎవరూ కూడా అలా మాట్లడకూడదు. ప్రత్యేకించి బహిరంగ వేదికలపై. మన పరిశ్రమలోనివారు అందరూ దీనిపై మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి’’ అని అనుపమ్ ఖేర్ చెప్పారు.
‘దలేర్జీ మీ మంచితనంపైనా, మీ వృత్తిధర్మంపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా. ఇలాంటి ఘటన జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నా’ అని చెప్పారు.
మరోపక్క దలేర్ మెహిందీ మద్యం తాగలేదని, ఇటీవల ఆయనకు ఆపరేషన్ జరగడం వల్ల ఆయన ఆరోగ్యం సరిగా లేదని దలేర్ సోదరుడు మికా సింగ్ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, TheKhelIndia
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా క్రీడల్లో, రెండో రోజు ముగిసే సమయానికి భారత్ మొత్తం 35 పతకాలను సాధించింది.
వీటిలో 9 స్వర్ణ, 11 రజత, 15 కాంస్య పతకాలు ఉన్నాయి.
పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్43/ ఎఫ్44/ ఎఫ్62/ ఎఫ్64 విభాగాల్లో) భారత్ క్లీన్ స్వీప్ చేసింది; దేవేంద్ర కుమార్ స్వర్ణం, రాకేష్ రజతం, ప్రదీప్ కుమార్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
పారా అథ్లెటిక్స్‌లో సిమ్రాన్ శర్మ మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో 24.80 సెకన్ల రికార్డు సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
వీరితో పాటు ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, పారా పవర్‌లిఫ్టర్ అశోక్ కుమార్ మాలిక్ రజత పతకాలను గెలుచుకున్నారు.
హోకాటో హోటోజె, ప్రవీణ్ శర్మ, ఆయుష్ వర్మ, నిరంజన్ ముకుందన్ కాంస్య పతకాలు సాధించారు. భారత క్రీడాకారులు పారా టేబుల్ టెన్నిస్, షూటింగ్లో కూడా పతకాలను గెలుచుకున్నారు.
పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా, చైనా 149 పతకాలతో మొదటి స్థానంలో ఉంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్ను క్లిక్ చేయండి.