నేపాల్‌లో ఆకస్మిక వరదలు: 100 మందికిపైగా భారతీయుల గల్లంతు, వరద బీభత్సం 11 ఫోటోలలో...

త్రిశూలి నదిలో సంభవించిన వరదలు

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, త్రిశూలి నదిలో సంభవించిన వరదల వల్ల బిదూర్, నువాకోట్‌లలో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా కనీసం 291 మంది విదేశీ పర్యటకులు సహా వందలాది మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నేపాల్‌లో 18 మంది మరణించారు. ఆ దేశ పర్యటక శాఖ అందించిన సమాచారం మేరకు గల్లంతైన వారి ప్రాథమిక జాబితాలో భారత్‌కు చెందిన 100 మందికి పైగా, యూకేకు చెందిన 12 మంది ఉన్నారు.

చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లో "భారీ ప్రాణనష్టం" జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా కూడా నివేదిస్తోంది .

నేపాల్ నుంచి ధృవీకృతమైన వీడియోలలో, వరద నీటి ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం కనిపిస్తోంది.

నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో బురద వరద నీరు ప్రవహించిన తర్వాత ఇళ్లు పాక్షికంగా మునిగిపోయినట్లు ఇతర చిత్రాల్లో కనిపిస్తోంది.

భూకంపం ఆకస్మిక వరదలకు దారితీయడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రసువా జిల్లాలో వరద బీభత్సం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రసువా జిల్లాలోని భోటేకోశి నది పొంగిపొర్లడంతో నేపాల్ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 17 మృతదేహాలను వెలికితీశారు. నువాకోట్ జిల్లాలో బురదలో కూరుకుపోయిన ప్రాంతం
 ఫోటో సౌజన్యం: ఉత్తరగయ గ్రామీణ పురపాలక సంఘం ఛైర్మన్ మాధవ్ ఆర్యల్

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, రసువాలోని భోటేకోశి నదిలో వచ్చిన వరద కారణంగా జిల్లాలోని ఉత్తరగయ గ్రామీణ పురపాలక సంఘం పరిధిలోని త్రిశూలి నది పరిసర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.
బురద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బురదలో కూరుకుపోయిన తమ ఇళ్ల వంక చూస్తున్న ప్రజలు.
త్రిశూలి నది పొంగి పొర్లుతోంది

ఫొటో సోర్స్, BBC/Ishwor Joshi

ఫొటో క్యాప్షన్, త్రిశూలి నది పొంగి పొర్లుతుండటంతో, చిత్వాన్‌లోని నది ఒడ్డున ఉండే ప్రాంతాలలో భద్రతాచర్యలను కట్టుదిట్టం చేశారు.
హెలికాప్టర్లు

ఫొటో సోర్స్, BBC/Shaktimaya Tamang

ఫొటో క్యాప్షన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఇప్పటివరకు మొత్తం 12 హెలికాప్టర్లను (వీటిలో ఎనిమిది ప్రైవేట్ రంగానికి చెందినవి, నాలుగు సైన్యానికి చెందినవి) సమీకరించినట్లు నేపాల్ సైన్యం పేర్కొంది.
భారీ వదరలు

ఫొటో సోర్స్, X

నేపాల్ నుండి ధృవీకరించిన వీడియోలలో, వరద నీటి ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం, ఓ పట్టణంలో అనేక భవనాలు ధ్వంసమైన అనంతర దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కఠ్మండుకు వాయువ్యంగా సుమారు 16 మైళ్ల (25 కి.మీ.) దూరంలో ఉన్న భాగమతి ప్రావిన్స్‌లోని నువాకోట్ జిల్లాలోని త్రిశూలి బజార్ ప్రాంతంలో ఈ క్లిప్‌లు ఉన్నట్లు బీబీసీ వెరిఫై గుర్తించింది.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, RSS

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, BBC/Shaktimaya Tamang

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని అనేక ప్రాంతాలు ప్రధాన ప్రాంతంతో సంబంధాలు కోల్పోయాయి.
నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Sunil Pradhan/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, వరద బీభత్సం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)