ఐపీఎల్- 2026 విజేత ఆర్సీబీ, వరుసగా రెండోసారి టైటిల్

ఐపీఎల్ 2026, క్రికెట్, ఆర్సీబీ, అహ్మదాబాద్ స్టేడియం

ఫొటో సోర్స్, ANI/X

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

గుజరాత్ టైటాన్స్‌ జట్టు విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది, ఐపీఎల్ 2026 విజేతగా నిలిచింది. ఆర్సీబీకి ఇది రెండో ఐపీఎల్ టైటిల్. వరుసగా రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది.

ఫైనల్లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 75 పరుగులు సాధించాడు.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఐపీఎల్ 2026, క్రికెట్, ఆర్సీబీ, అహ్మదాబాద్ స్టేడియం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆర్సీబీ జట్టు వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 10 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భువనేశ్వర్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్(12 పరుగులు) కూడా ఔటయ్యాడు.

నిషాంత్ సింధు, జోస్ బట్లర్ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే, నిలకడగా ఆడుతున్న నిషాంత్ సింధు (20 పరుగులు) కూడా ఔటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. మరికాసేపటికే బట్లర్ (19 పరుగులు) కూడా ఔటయ్యాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్, ఐపీఎల్ 2026

ఫొటో సోర్స్, SHAMMI MEHRA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్-2026 ఫైనల్ జరుగుతోంది. (ఫైల్ ఫోటో)

ఇక మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే, రాహుల్ తేవాటియా(7 పరుగులు), హోల్డర్ (7 పరుగులు) కూడా వెంటవెంటనే ఔటవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది.

ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్, ఐపీఎల్ 2026

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, (ఫైల్ ఫోటో)

టాస్ గెలిచిన ఆర్సీబీ

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది.

గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వెంకటేష్ అయ్యర్, కనిష్క్ చోహన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మొహమ్మమద్ సిరాజ్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుశాగ్ర, సాయి కిషోర్.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)