You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
లైవ్ కవరేజీ
ఒంటిగంట సమయానికి తమిళనాడులో 56.81, పశ్చిమ బెంగాల్‌లో 62.18 శాతం ఓటింగ్
పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు, తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట వరకు బెంగాల్‌లో 62.18 శాతం, తమిళనాడులో 56.81 శాతం ఓటింగ్ నమోదైంది.
బెంగాల్‌లో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా, తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కల్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఝర్‌గ్రామ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలోకి అడవి ఏనుగు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
టీ20 ప్రపంచ కప్ సమయంలో ‘‘డ్రగ్స్ తీసుకున్న పాకిస్తానీ క్రికెటర్’’ - ఐసీసీ నివేదికపై పీసీబీ ఏం చెబుతోంది?
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత
ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.
పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.
బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
కవల పిల్లలకు వేరు వేరు తండ్రులు.. ఇదెలా సాధ్యమైంది? ఈ కేసు గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్
నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.
అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?
కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.
చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.
ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్
పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?
'నమాజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?
టీజీఎస్ఆర్టీసీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. చర్చలపై ప్రతిష్ఠంభన ఎందుకు ఏర్పడింది?
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి
"నా సొంత ఇంట్లోనే నన్ను రహస్యంగా వీడియో తీయడం చిత్రవధకు గురిచేసింది’’
పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?
గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?
హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?
నందిగ్రామ్: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్